ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > "మెగా" ప్రణాళికలు ప్రత్యర్థుల్లో గుబులుపుట్టిస్తున్నాయా..?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"మెగా" ప్రణాళికలు ప్రత్యర్థుల్లో గుబులుపుట్టిస్తున్నాయా..?
మహేష్ ఇమేజ్‌ను తమ ప్రచారంలో ఉపయోగించుకోవాలన్నది కాంగ్రెస్ సంకల్పం కాబోలు. ఇలా సినీతారలు విభిన్న పార్టీల్లో ఉన్న కారణంగా వారి అభిమాన సంఘాల మధ్య సాధారణంగానే ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉంది. అశేష అభిమాన ఆదరణ ఉన్న చిరంజీవికి అభిమానులను హద్దుల్లో ఉండేలా చూసుకోవడం కత్తిమీదసామయితే... అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం అదో ఘట్టం లాంటిదని చెప్పొచ్చు.

సహజంగా చిరంజీవి సున్నిత స్వభావుడని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వివిధ పార్టీల నేతలు సంధించే బాణాల నుంచి తప్పించుకోవడం... ఇప్పుడిప్పుడే రాజకీయ వాతావరణాన్ని వంటబట్టించుకుంటున్న చిరుకు సులభసాధ్యం కాకపోవచ్చు. అందుకే మిగిలిన పార్టీలపై విమర్శలు చేసేందుకు ప్రజారాజ్యం పార్టీ దూరంగా ఉంటూ వస్తోందన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఒక అసెంబ్లీ అభ్యర్ధి రంగంలోకి దిగాలంటే కనీసం రూ. 5 కోట్ల వరకు ఖర్చవుతుందన్న వార్తలను మనం వింటూనే ఉన్నాం. ఇదే గనుక నిజమైతే అంతటి భారీ బడ్జెట్‌ను ఎలా సమీకరిస్తారూ...? లేదంటే కేవలం "సేవే మార్గం... ప్రేమే లక్ష్యం"గా... అంటే ఒక్క పైసా ఖర్చు చేయకుండా సంతోషాంధ్రప్రదేశ్‌కు అధిపతి అవుతారా...? ఇత్యాది ప్రశ్నలన్నిటికీ వచ్చే ఎన్నికలే వేదిక. సో వెయిట్ అండ్ సీ...
<< 1 | 2 | 3 
మరిన్ని
'మెగా' చర్చకు దారితీసిన 'బాబు' విమర్శలు
ప్రజారాజ్యం "మెగా" నేతకు వివాదాల సెగ
'ప్రజారాజ్యం' చుట్టూ తెలుగు రాజకీయం
ఢిల్లీ చేరిన 'ప్రజారాజ్యం' పంచాయతీ
రాజకీయ పార్టీలకు 'మెగా' ఛాలెంజ్
విష్‌ యు హ్యాపీ పాలిటిక్స్‌ టూ యూ....