ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > ఓటరన్నోయ్.. ఏం చేస్తావ్...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఓటరన్నోయ్.. ఏం చేస్తావ్...?
Venkateswara Rao. I
"కంటి చూపుతో అంతం చేస్తా..." యువరత్న పంచ్. " సినిమా తారలు ఎలా ఉంటారో చూద్దామని జనాలు వస్తున్నారు. అంతేగాని వాళ్లంతా ఓట్లేయరు" నటి రోజా విశ్లేషణ. మరి యువగర్జనకు వచ్చిన జన సందోహం... బాలకృష్ణ, హరికృష్ణ, కల్యాణ్ రామ్, తారకరత్నలను చూసేందుకు వచ్చినవాళ్లా...? వారంతా ఓటు వేసే వాళ్లేనా...? దీనిపై తెలుగు మహిళా అధ్యక్షురాలు ఏం చెపుతుందో ఒకసారి అడుగుతావా ఓటరన్నా...?

ప్రత్యేక తెలంగాణా అంశం ప్రణబ్ కమిటీ పేరుతో నలుగుతున్నప్పటికీ, ప్రజా అంకిత యాత్రతో ప్రజారాజ్యం, యువగర్జనతో తెలుగుదేశం పార్టీలు రాష్ట్రమంతా తిరుగుతున్నప్పటికీ... తమ బలం ఏమాత్రం తగ్గదంటోంది పాలకపక్షం. ఈ బలమెంతో వచ్చే ఎన్నికల్లో నువ్వే చెప్పాలన్నా... ఓటరన్నా.

ఇక కొత్తగా ఏర్పాటైన ప్రజారాజ్యం సిరిసిల్ల చేనేత కార్మికుల వ్యధలను చూసి చలించిపోయింది. అటు తర్వాత సింగరేణి కార్మికుల బాధలు... ఇలా స్థానిక సమస్యలపై గురిపెట్టింది. దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్న వారిని వృద్ధిలోకి తెచ్చి సంతోషాంధ్రప్రదేశ్ చేస్తానంటోంది. మరి ప్రజారాజ్యాన్ని ఏం చేస్తావో ఓటరన్నా...

చెట్టాపట్టాలేసుకుని తిరిగే వామపక్షాలు చెరో చెయ్యిని పట్టుకుంటామంటున్నాయి. వారికి నువ్విచ్చే హ్యాండ్ ఎలా ఉంటుంది ఓటరన్నా....? చివరగా తెలంగాణా రాష్ట్ర సమితి, నవ తెలంగాణా, తల్లి తెలంగాణా... అన్నిటికీ జై తెలంగాణా అంటావో లేదో అన్నా...? నిజంగా నీ ముందు పేద్ద సవాలే ఉంది గదన్నా...!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎన్టీఆర్ ప్రసంగం.. ఒక చిన్న వీడియో  
'యువగర్జన'లో జూనియర్ ఎన్టీఆర్ గర్జిస్తారా?
'లీకు వీరుడు'తో ప్రరాపాలో గుబులు
'యువగర్జన'...తెలుగుదేశానికేనా...?
తొలివిడత 'ప్రజా అంకిత యాత్ర' మెగా హిట్
తెలంగాణ గానం తెదేపా పుట్టె ముంచుతుందా?