ఎన్నికలు... ఈ మాట వింటే నేతల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అధికార పక్షం మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకోగలమో లేదోనని ఆందోళనలో మునిగిపోతుంది. ఇక విపక్షాలు, పాలకపక్షంపై విమర్శల జడివాన కురిపిస్తాయి. అంతకముందు తాము చేసిన పనులను ప్రజలు మరచిపోయారనుకునే భ్రమలో పడిపోతాయి. అయితే వీటన్నిటినీ చాలా సునిశితంగా గమనిస్తారు ఓటర్లు. ఎవరికి పట్టం కట్టాలో వారికి తెలుసు. చాలా నిశ్శబ్దంగా ఓటు పోటుతో కొరగాని నేతను పక్కకు నెట్టేస్తారు. " నా పాలన భేష్, నా హయాంలో అంతా సుభిక్షం" అని గప్పాలు కొట్టిన ఎందరో నేతలను గద్దె దించి... అసలు నిజం చూడమని కళ్లు తెరిపించిన పవర్‌ఫుల్ రథసారథులు ఓటర్లు. అందువల్లనే ప్రతి రాజకీయ పార్టీ అధినేత ప్రస్తుతం రోడ్ షోలు, బహిరంగ సభలతో మహా బిజీగా ఉన్నారు.ఈ నేపధ్యంలో మా వీక్షకులకోసం భారతదేశ ఎన్నికల పేరిట ఓ ఆటను ప్రవేశపెట్టింది వెబ్‌దునియా. ఈ ఆటలో మీకు ఇష్టమైన నేతలను ఎన్నుకుని తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా ఉన్న పార్టీ ఏదో చెప్పేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం... ఆట మొదలుపెట్టడానికి ఇక్కడ క్లిక్ చేయండి. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |