ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > రాజకీయ పార్టీలు.. గుప్పిస్తున్న హామీలు!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాజకీయ పార్టీలు.. గుప్పిస్తున్న హామీలు!
FileFILE
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఒక వైపు సంక్షేమ ఉత్సవాల పేరుతో అధికార కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లింది. మరోవైపు మహా కూటమిగా ఏర్పాటైన తెలుగుదేశం, వామపక్షాలు, తెరాస పార్టీలు రాజకీయ సమ్మేళనాల పేరుతో ప్రజలను మేలుకొల్పేందుకు శ్రీకారం చుట్టారు.

అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ పంథాలో ప్రజల్లోకి వెళుతుండగా... మూడో ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఇప్పటికే ప్రజా అంకిత యాత్రల పేరుతో తన సత్తాను చాటుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆకర్షించేలా వరాలు, హామీలు గుప్పించే పనిలో పడ్డాయి.

ఇందులో కాంగ్రెస్ ముందుండగా, తెదేపా ద్వితీయ స్థానంలో ఉంది. అయితే మెగాస్టార్ ప్రకటంచిన రూ.వందకే వంట సరుకు అనే పథకం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు ఇప్పటి వరకు గుప్పించిన హామీల వివరాలను పరిశీలిద్దాం.

తెలుగుదేశం హామీలు..
* పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం.
* ప్రతి పేద కుటుంబానికి మూడు సెంట్ల భూమి.
* గృహ నిర్మాణాలకు ఇచ్చిన రుణాలు మాఫీ.
* రేషన్‌ షాపుల ద్వారా 40 కిలోల బియ్యం.
* తెల్ల కార్డుదారుడు ప్రమాదంలో మృతి చెందితే రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా.
* రైతులకు పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్‌.
* సన్న, చిన్నకారు రైతులకు 10 పైసల వడ్డీకి రుణాలు.
* బీసీ సంక్షేమానికి 3 వేల కోట్లతో ప్రత్యేక బ్యాంకు.
* బీసీలకు బ్యాంకు రుణాలు మాఫీ.
* బీసీ విద్యార్థుల మెస్‌ ఛార్జీలు రు.900.
* నిరుద్యోగ భృతి వెయ్యికి పెంపు.
* విద్యార్థులకు ఉచిత బస్‌ పాసులు, సైకిళ్లు పంపిణి.
* చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్‌.
* మైనారిటీల సంక్షేమానికి 500 కోట్లు.
* వికలాంగులకు వెయ్యి పెన్షన్‌.
* ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ఇళ్లు.
* మేదర, వడ్డెరకు సబ్సీడీపై వెదురు, క్రషర్లు సరఫరా.

అమలవుతున్న కాంగ్రెస్ పథకాలు..
* విద్యార్థులకు స్కాలర్‌షిప్‌, ఫీజుల రీయంబర్స్‌మెంట్‌.
* ఉచిత విద్యుత్‌ పంపుసెట్లు - 26 లక్షల మందికి ప్రయోజనం.
* ఆరోగ్యశ్రీ - లక్షన్నర మందికి ప్రయోజనం.
* హౌసింగ్‌ స్కీం - 70 లక్షల మందికి ప్రయోజనం.
* కిలో బియ్యం రూ.2.. కోటీ 90 లక్షల మందికి ప్రయోజనం.
* భూపంపిణీ - 4 లక్షల 34 వేల మంది ప్రయోజనం.
* గ్రామీణ ఉపాథి హామీ పథకం - 1,09,16,000 మంది ప్రయోజనం.
* ఇందిరప్రభ - 3లక్షల 67 వేల మందికి ప్రయోజనం.
* పశుక్రాంతి - 71,326 మందికి ప్రయోజనం.

ప్రజారాజ్యం హామీలు..
* రూ.వందకే వంట సరకు. (25 కిలోల బియ్యం, అర కేజీ చింతపండు, కేజీ ఉప్పు, కిలో కందిపప్పు తదితర వస్తువులు).
* డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు.
* ఫ్రీకేజీ నుంచి పీజీ వరకు బాలికలకు ఉచిత విద్య.
* చేనేత కార్మికుల కోసం ప్రత్యేక టెక్స్‌టైల్ పార్కు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"వందకే వంట సరుకు" పథకం "మెగా భారం"
ఆళ్లగడ్డలో "రాజ్యం" - ఆలూరులో "దేశం"
రాష్ట్ర 'రాజకీయ జోకర్‌'గా కేసీఆర్
'మీసం మెలేసి.. తొడగొట్టి'... సత్తాచాటిన చిరు
కాంగ్రెస్ సర్కారు ముంగిట సమస్యల కొలువు
ఎలక్షన్స్ 2009... ఆట మొదలైంది