ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > సీట్ల పంపిణీ "మహా" సంగ్రామమే!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సీట్ల పంపిణీ "మహా" సంగ్రామమే!
PNR
Sr Sub-Editor
FileFILE
రాష్ట్రంలో నాలుగు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏకమై మహా కూటమిగా ఆవిర్భవించి సరికొత్త చరిత్రకు నాంది పలికాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇదో అస్త్రంగా భావిస్తున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి కూటమి విపక్ష నేతల్లో నూతనోత్తేజం నింపుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. ఈ ఆనందం ఎంత కాలం ఉంటుదనేది ప్రస్తుతం అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రధాన ప్రశ్న.

తెలుగుదేశం (తెదేపా), వామపక్షాలు (సీపీఐ-సీపీఎం), తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య పొత్తు ఎన్నో తర్జన భర్జనల మధ్య కుదిరింది. కానీ టిక్కెట్ల పంపిణీలోనూ సానుకూల వాతావరణం కనిపిస్తుందా అంటే చెప్పలేం. ఒక వేళ అధినేతల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నప్పటికీ.. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు, టిక్కెట్లు ఆశించి భంగపాటుకు గురయ్యే (ఎన్నికల సమయంలో) నేతల మధ్య సయోధ్య కుదర్చడం అనేది తలకు మించిన భారం కానుంది.

ఎన్నికల సీట్ల సర్దుబాటులో తలెత్తబోయే సమస్యలపై ఒకసారి నిశితంగా అవలోకనం చేస్తే.. మహాకూటమిగా ఏర్పడిన తెదేపా, లెఫ్ట్, తెరాస పార్టీల మధ్య సీట్ల పంపిణీ కూటమిలో చీలికకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు. ఇదే కూటమి అధినేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేస్తోంది. ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలో ఇంకా ప్రయత్నాలే ప్రారంభం కాకపోయినా ఇప్పటి నుంచే ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం సీట్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో ప్రాతినిథ్యం వహించిన స్థానాల్లో కూటమి ధర్మం పాటించగలమో లేదో అనే ధర్మ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా తెరాసకు కేటాయించే సీట్ల విషయంలో త్యాగాలకు సిద్ధంగా ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే పార్టీ నేతలకు హెచ్చరిక చేశారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు తాము సహకరిస్తామని వామపక్ష నేతలు చెపుతున్నారు. అయితే అధినేతల మాటలను, అదేశాలను, హెచ్చరికలకు ద్వితీయ శ్రేణి నేతలు తు.చా. తప్పకుండా పాటిస్తారా అన్నది తొలి ప్రశ్న. ఒకవేళ టిక్కెట్లను ఆశిస్తున్న వారిని బుజ్జగించి, కూటమిలోని ఇతర పార్టీకి టిక్కెట్ కేటాయిస్తే పార్టీ కార్యకర్తలు కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేస్తారా అన్నది రెండో ప్రశ్న.

ఇదిలావుండగా.. సీట్ల సర్దుబాటులో వామపక్షాల నేతలు పెద్దగా పట్టు విడుపులకు వెళ్లక పోయినా.. తెరాస-తెదేపాల మధ్య ఈ పోటీ నెలకొనే ప్రమాదం ఉంది. తెరాసతో మాత్రం ఒక్కొక్క సీటుకూ పంతాలు, పట్టింపులు తప్పేట్టు లేవు. దీనిపైనే తెదేపా నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తెరాసకు మంచి పట్టున్న తెలంగాణా ప్రాంతంలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. వీటిలో సగం సీట్లను తెరాస కోరే అవకాశం లేక పోలేదు.

క్రితం సారి కాంగ్రెస్‌తో జతకట్టిన తెరాస 54 సీట్లు పోటీ చేసింది. ఈ దఫా మాత్రం తమ లక్కీ నంబర్ 42 అసెంబ్లీ సీట్లను కోరే అవకాశం ఉంది. మొత్తం స్థానాల్లో ఈ సీట్లు పోగా.. మిగిలేవి 77 స్థానాలు. వీటిలో వామపక్షాలలో సిపిఎంకు గత ఎన్నికల్లో గెలిచిన ఆరు స్థానాల (తెలంగాణ)కు అదనంగా మరో రెండు, సిపిఐకి అదే దామాషాలో గెలిచిన నాల్గింటికి మరో రెండు స్థానాలు కలిపితే 14 స్థానాలు వెళతాయి. ఇక తెదేపాకు మిగిలేది 63 సీట్లు మాత్రమే.

ఇంతవరకు చెప్పుకునేందుకు బాగానే వుంది. కానీ.. తెలంగాణా వాదం బలంగా ఉన్న ఉత్తర తెలంగాణా జిల్లాలో తెదేపాకు మంచి పట్టు వుంది. ఇందుకు పలు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతాల్లో భారీగానే ఓట్లు సాధించింది. స్టేషన్‌‌ఘన్‌పూర్‌ నుంచి కడియం శ్రీహరి, ఖానాపూర్‌ నుంచి సుమన్‌ రాథోడ్‌ గెలుపొందారు. ఇలాంటి జిల్లాల్లో తెరాసకు ఎక్కువ సీట్లు ఎలా కేటాయిస్తామని తెదేపా సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
1 | 2  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రాజకీయ పార్టీలు.. గుప్పిస్తున్న హామీలు!
"వందకే వంట సరుకు" పథకం "మెగా భారం"
ఆళ్లగడ్డలో "రాజ్యం" - ఆలూరులో "దేశం"
రాష్ట్ర 'రాజకీయ జోకర్‌'గా కేసీఆర్
'మీసం మెలేసి.. తొడగొట్టి'... సత్తాచాటిన చిరు
కాంగ్రెస్ సర్కారు ముంగిట సమస్యల కొలువు