ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > మహా కూటమిలో మహా గందరగోళం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహా కూటమిలో మహా గందరగోళం
FILE
వచ్చే ఎన్నికలలో పాలకపార్టీ కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తామంటూ ఏకమైన నాలుగు పార్టీల మహాకూటమి సీట్లకోసం కొట్టుకుంటున్నాయి. తెరాస తనదైన బాణీలో 10 లోక్‌సభ స్థానాలు, 51 శాసన సభ స్థానాలనును కావాలని కోరుతోంది. ఇక సీపీఐ, సీపీఎంలు చెరో 20 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలతో సర్దుకుంటామని చెపుతున్నాయి. సీపీఐ, సీపీఎం అడిగిన సీట్లకు ఒకటి తగ్గించి ఇచ్చేందుకు తెలుగుదేశం దాదాపు అంగీకరించింది.

అయితే తెరాస పార్టీది గొంతెమ్మ కోర్కెగా మిగిలిన మూడు పార్టీలలోని కొందరు నేతలు లోలోపల గొణుగుతున్నట్లు సమచారం. తెలంగాణా సాధన కోసం ఆవిర్భవించిన పార్టీకి ఆ ప్రాంతంలోని సింహభాగం సీట్లను కేటాయించాలని తెరాస డిమాండ్ చేస్తోంది. అయితే తెలంగాణా ప్రాంతంలో తాము మహా బలంగా ఉన్నామని తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారు. అందువల్ల తెరాస కోరినన్ని సీట్లు ఇవ్వడానికి తాము సుముఖంగా లేమని చెబుతున్నారు.

తెలుగుదేశం వాదన ఇలా ఉంటే... తెరాస స్పందన మరో విధంగా ఉంది. గత ఎన్నికలలో తెలంగాణా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని గద్దె దించి, తెలంగాణా ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంగా తాము తెలుగుదేశంతో చేతులు కలపడానికి సిద్ధ పడినట్లు చెపుతున్నారు. ఒకవేళ సీట్ల సర్దుబాటుపై అంగీకారం కుదరని పక్షంలో ఒంటరి పోరుకు దిగుతామంటున్నారు.

ఇదిలా ఉంటే... నాలుగు పార్టీలు కలవడంతో క్షేత్ర స్థాయిలో చురుకుగా పనిచేస్తున్న నాయకులకు మహాకూటమి పెనుముప్పు తెస్తుందని భయపడుతున్నారు. సీట్ల సర్దుబాటు ఫలితంగా తమ స్థానాలను కోల్పోతామేమోనన్న ఆందోళనలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు నాయకులైతే తెరాస- తెదేపా మధ్య సీట్ల సర్దుబాటు సజావుగా సాగకూడదని కోరుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇక రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన ప్రజారాజ్యం, తెరాస పార్టీది ఊసరవెల్లి రాజకీయమని అభివర్ణించింది. తమతో పొత్తుల విషయమై మాట్లాడుతూనే తెలుగుదేశంతో చేతులు కలపటం వెనుక ఉన్న ఆంతర్యాన్ని వారే చెప్పాలనీ, ఇటువంటి పొత్తులను ప్రజలు విశ్వసించరని విమర్శిస్తోంది. మొత్తమ్మీద చూస్తే వచ్చే ఎన్నికలలో ఒకవేళ మహాకూటమే విజయం సాధించినా... పాలనా సమయంలోనూ పరస్పరం విభేదాలు తలెత్తకుండా ఉంటాయా...? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రాజకీయ పార్టీల్లో "చిరు" పథకాల గుబులు
ప్రకాశం 'మెగా' ప్రభం'జనం'
ప్రజల వద్దకు నందమూరి హీరోలు
సీట్ల పంపిణీ "మహా" సంగ్రామమే!
రాజకీయ పార్టీలు.. గుప్పిస్తున్న హామీలు!
"వందకే వంట సరుకు" పథకం "మెగా భారం"