ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 > తెరాసకు 41 అసెంబ్లీ, 7 ఎంపీ సీట్లు?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తెరాసకు 41 అసెంబ్లీ, 7 ఎంపీ సీట్లు?
మహాకూటమిలో పొత్తుల్లో భాగంగా సీట్ల సర్ధుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన కూటమిలో సీట్ల సర్ధుబాటు పెద్ద సమస్యలా పరిణమించింది. తెరాసతో పాటు సీపీఎం, సీపీఐ ఎవరికి వారు తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో సీట్ల ఖరారు ఆలస్యమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పది లోక్‌సభ స్థానాలు, 45 అసెంబ్లీ స్థానాల కోసం డిమాండ్ చేస్తుండగా, వామపక్షాలైన సీపీఎం, సీపీఐలు 25 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కోరుతున్నాయి.

అయితే, తెరాస అడిగినన్ని స్థానాలు ఇవ్వడంపై తెలుగుదేశ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. తెదేపా మొదటి నుంచి తెలంగాణలో బలంగానే ఉందనీ, ఇప్పుడు తెలంగాణకు అనుకూల ప్రకటనతో పార్టీ పరిస్థితి మరింత మెరుగవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అదీగాక తెరాస తెలంగాణలోని రెండు మూడు జిల్లాల్లోనే పటిష్టంగా ఉందనీ చాలా జిల్లాల్లో బలంలేని తెరాసకు ఎక్కువ స్థానాలు ఇవ్వరాదని పార్టీ శ్రేణులు హెచ్చరించాయి.

ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు ఆయా పార్టీలకు కేటాయించే స్థానాలపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయమైన సమాచారం మేరకు తెరాసకు 41 అసెంబ్లీ, 7 లోక్‌సభ స్థానాలు, వామపక్షాలకు చెరో 17 శాసనసభ, రెండు ఎంపీ సీట్లు ఇవ్వలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఇంచుమించు ఒకటి రెండు మార్పులు మినహా తుది నిర్ణయాన్ని మరో వారంలోగా ప్రకటించనున్నాయని సమాచారం. అయితే మందకృష్ణ మద్దతును పార్టీలు బయటి నుంచి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కొన్ని సీట్లు కేటాయిస్తే మాలలకు చెందిన ఓట్ల గల్లంతయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఏ రాజుకి ఓటరన్న కిరీట ధారణం చేస్తాడో..?!!
చిరు.. బాలయ్య "లోపాయకారి" ఒప్పందం!
కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: కూటమి కుదేల్!
రాజశేఖర్ చేరిన పార్టీ మటాషేనట...!
మహాకూటమిలో "ఎజెండా" ముసలం!
బుల్లితెరలో ఎన్నికల ప్రకటనల యుద్ధం