ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 > ఓటు వేయాలా..? ఓటుకి ఎంతిస్తావ్...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఓటు వేయాలా..? ఓటుకి ఎంతిస్తావ్...?
IVR
ఆ రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుంటాయి. అక్కడి ప్రభుత్వ పగ్గాలు ఐదేళ్లకోసారి మరో రాజకీయ పార్టీ చేతిలోకి మారుతుంటాయి. ఐదేళ్ల పాలనలో కాస్తంత తేడా వస్తే అక్కడి ప్రజలు వారికి చెల్లు చీటి రాసి గద్దెపై నుంచి కిందికి తోసేస్తారు. విజయం వరిస్తుందో... లేదో అని బెంగపడే పార్టీ ఆశ్చర్యపడేలా పీఠాన్ని కట్టబెట్టి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెడతారు. ఈ ఓటర్లు ఎవరో తెలుసా? దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలవారు.

వినడానికి బాగానే ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈ దక్షిణాది రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే చాలు, ధన ప్రవాహానికి అంతూ పొంతూ ఉండటం లేదని ఢిల్లీకి చెందిన ఓ మీడియా అధ్యయనంలో తేలింది. ప్రాంతీయ, జాతీయ పార్టీలనే భేదం లేకుండా ఓటుకు నోట్లు పంచడం సంప్రదాయంగా మారుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది.

సుమారు ఇరవై రాష్ట్రాల్లో 40 వేల మంది ఓటర్లను, ఓటుకు డబ్బు తీసుకుంటున్నారా...? అని ప్రశ్నించడం జరిగింది. ఇందులో తేలిందేంటయా అంటే... దేశ రాజధాని ఢిల్లీలోనే 25% మంది ఓటర్లు డబ్బుకు తమ ఓటును నిలువునా అమ్మేసుకుంటున్నారట. పేద, నిరుపేద తరగతులకు చెందిన ప్రజలు ఓటుకు డబ్బు తీసుకోవడాన్ని నామోషీగా భావించడం లేదట.

దేశం మొత్తమ్మీద చూసినప్పుడు ఏ బాదరబందీ లేని కుటుంబాల్లో 22శాతం ఓటుకు డబ్బు తీసుకుంటున్నట్లు తేలింది. ఇక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిలో 37శాతం డబ్బు ఇవ్వనిదే ఓటు వేయరని అధ్యయనంలే రుజువైంది.

ఇక రాష్ట్రాల విషయానికి వస్తే ఓటుకు నోటు విషయంలో కర్ణాటక అగ్ర స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడి జనరల్ క్యాటగిరీలో ఉన్న ప్రజలలో 45 శాతం డబ్బుకి తమ ఓటును అమ్ముకుటున్నారు. అదేవిధంగా తమిళనాడులో 33శాతం, మధ్యప్రదేశ్‌లో 32 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 31 శాతం ప్రజలకు ఓటుకు డబ్బు ఇవ్వాల్సిందే.

మన రాష్ట్రంలోని దారిద్ర్య రేఖకు దిగువను ఉన్న ప్రజలలో 94 శాతం నోటుకు ఓటు వేసేందుకు అంగీకరిస్తున్నారని తేలింది. ఇది ఆందోళన కలిగించే అంశం. మన రాష్ట్రం తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. తమిళనాడులో 75 శాతం, కర్ణాటక 72శాతం ప్రజలు ఓటు వేయడానికి డబ్బు తీసుకోవడాన్ని అంగీకరిస్తున్నారు. ఈ సంస్కృతి ఇలానే కొనసాగితే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చక పోవడం వల్ల కూడా ప్రజలు ఈ దారిని ఎంచుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గద్దెనెక్కాక ఎలాగూ పైసా ప్రయోజనం ఉండదు కనుక ముందే వచ్చినంత తీసుకుంటే పోతుందన్న అభిప్రాయం చాలామంది ప్రజలలో ఉన్నట్లు తేలింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పొలిటికల్ పార్టీలకు సమ్మర్ ఫీవర్... దటీజ్ తెలుగు ఓటర్
ఎన్నికల సమరంలో "తారా"తోరణ తళుకులు
డబ్బు దండుకోవడానికేనా రాజకీయాలు..?
ప్రత్యర్థుల బలంతో కేసీఆర్‌కు "ముచ్చెమటలు"
చిరుపై సినీ పరిశ్రమ మూకుమ్మడి దాడి
తెరాసకు 41 అసెంబ్లీ, 7 ఎంపీ సీట్లు?