ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 > కాలసర్పయోగంతో చిరంజీవికి రాజయోగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాలసర్పయోగంతో చిరంజీవికి రాజయోగం
FileFILE
ప్రముఖ సినీ నటుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జన్మకుండలిలో సూర్యుడు ఉన్న స్థితిననుసరించి అతనికి రాజయోగం పట్టనుందని పలువురు జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి పుట్టినప్పుడు చంద్రుడు కన్యా రాశిలో విరాజిల్లడంతో ఈ జాతకునికి ధార్మిక ప్రవృత్తి మరియు అపారమైన తెలివిని ఇస్తాడు. ఇవి చిరంజీవిలో పుష్కలంగా ఉన్నాయన్నారు.

చిరంజీవి జన్మకుండలిలో సంపూర్ణ కాలసర్పయోగం ఉంది. ఇది అతనికి రాజయోగం ఇస్తుంది. ఈ జాతకుడు నిత్యం శివారాధన చేయాల్సివుంటుంది. దీంతోబాటు అతను కాలసర్పయోగ పూజకూడా చేయవలసి ఉంటుందని వారు అంటున్నారు.

అలాగే "నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాద రాగాయ, మహేశ్వర నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై న కారాయ నమ: శివాయం" అనే మంత్రాన్ని ప్రతిరోజూ జపిస్తే ఫలితం సానుకూలంగా ఉంటుందని అంటున్నారు.

చిరంజీవి జన్మకుండలిలో బుధుడు ఏకాదశ భావంలో ఉండటం మూలాన బుధుడు లాభానికి అధిపతి. కావున ఈ జాతకునికి
FileFILE
డబ్బుకు లోటుండదు. దీంతోబాటు కుటుంబం కష్టాలపాలవుతుంది. చిరంజీవి జన్మకుండలిలో గురువు కర్కాటక రాశిలో ఉండటంమూలాన తన స్త్రీ, పుత్ర, పౌత్రాది వర్గాలు మరియు ధనంతో తులతూగుతుంటారని చెప్పారు.


శుక్రుని కారణంగా జాతకునికి ధనం నిరంతరం ప్రవాహంలా ఉంటుంది. శని ప్రథమ స్థితిలో ఉండటంమూలాన జాతకుడు సంపన్నుడవుతాడు. శని దృష్టి నీచంగా ఉంటుంది. దీంతో చిరంజీవి మానసికంగా ఒత్తిడికి లోనవుతుంటాడు. ప్రస్తుతం శని తులారాశిలో ఉండటం మూలాన రాజయోగం పట్టనుందని జోతిష్యులు తెలుపుతున్నారు.

చిరంజీవి మంగళ మహర్‌దశలో పుట్టడంమూలాన ఇది 3సంవత్సరాల 9నెలలా 10 రోజులుండింది. గడచిన కాలంలో భోగాలను అనుభవించాడు. ప్రస్తుతం 19 సంవత్సరాల వరకు శని మహర్‌దశ జరుగుతుంది. ఇది 2/6/1993 నుండి 2/6/2012 వరకు ఉంటుంది. ఈ సంవత్సరం మే నెల ఒకటవ తేదీనుంచి జూన్ 25వ తేదీవరకు అతనికి అదృష్టం కలిసివస్తుంది. కావున మే ఒకటవ తేదీవరకు ఇతరుల సలహాలపై పనులు చేసుకుంటే బాగుంటుందని జోతిష్యులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో తన ప్రత్యర్థి వర్గాలను చిత్తుగా ఓడించి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రానున్న ఆగస్టు నెలనుంచి అక్టోబరు ఒకటవ తేదీ వరకు మిత్రులు మరియు ఇతర రాజకీయ పక్షాల సహకారంతో లాభపడనున్నారు. ఇలాంటి జాతకులు ప్రస్తుతం తన ప్రత్యర్థులకు తలనొప్పిగా మారుతుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

చిరంజీవి నీలంతో కూడుకున్న లాకెట్‌ను ధరించి శివ, గణేషుని ఆరాధన చేస్తే తప్పకుండా ఫలితముంటుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సార్వత్రిక ఎన్నికలు: పోలింగ్‌కు సర్వం సిద్ధం
శీర్షాసనంలో రాష్ట్ర రాజకీయాలు
ఎన్నికల సమరం: ప్రజారాజ్యం చరిత్ర సృష్టించేనా?
ఉచిత వాగ్దానాలకు ఎక్కువ-అభివృద్ధి హామీలకు తక్కువ
టైగర్ వర్సెస్ రాములమ్మ
రాష్ట్రంలో "కింగ్" మేకర్ చిరంజీవి