నెలలో ఒకరోజు ఉపవాసం ఉండటంవలన హృద్రోగాల బారిన పడకుండా ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక రోజు పూర్తిగా నిరాహారంగా గడిపినట్లయితే దేహ కార్యకలాపాల వ్యవస్థ కొత్త ఉత్తేజాన్ని పొందుతుందని, తదనుగుణంగా దేహం మరింత సామర్ధ్యంతో పనిచేస్తుందని ఇటీవల చేపట్టిన అధ్యయనం తాలూకూ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ప్రతి రోజు ఆహారం తీసుకునే వారితో పోల్చినట్లయితే, నెలకు ఒక రోజు ఉపవాసం ఉండే వారికి హృద్రోగాలు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుందని తెలియవచ్చింది.
ఉపవాసం ఉండే వారు గుండె రక్షక ప్రయోజనాలు పొందుతారని, సాధువులు, సన్యాసులు అవలంబించే ఆరోగ్యకరమైన జీవనశైలి ఇందుకు నిదర్శనమని సాల్ట్ లేక్ సిటీలోని యుటా విశ్వవిద్యాలయానికి చెందిన డా. బెంజిమిన్ హోర్నే పేర్కొన్నట్లు డెయిలీ మెయిల్ ఊటంకించింది.
|