హృదయంలో రంధ్రం చోటు చేసుకోవడంతో వ్యాధిగ్రస్థుడైన ఏడు సంవత్సరాల అరవింద్ బెఘెల్ శస్త్రచికిత్స అనంతరం కోలుకోంటున్నాడు. శస్త్రచికిత్స కన్నా కూడా అతనికి అవసరమైన బాంబే బ్లడ్ రకపు రక్తాన్ని సేకరించడం అరవింద్ పేదకుటుంబానికి ఇబ్బందిగా పరిణమించింది.
శస్త్రచికిత్సకు అవసరమైన నిధులను సంపాదించడం అతని తండ్రి అశ్వినికి పెద్ద సమస్య కాలేదు. ఆ విషయంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయం చేసింది. కానీ 50,00,000 మందిలో ఒకరికి మాత్రమే ఉండే బాంబే బ్లడ్‌ను సంపాదించడం కష్టసాధ్యమైంది.
భారతదేశంలో బాంబే బ్లడ్‌ను కలిగివారు కేవలం 50 మంది మాత్రమే ఉన్నారని గుర్తించబడింది. ఇదిలా ఉండగా బాంబే బ్లడ్ రక్తదాతల కోసం అశ్విని మరియు ఆయన బంధువులు ఆరునెలల పాటు దేశమంతా వెదికారు. చివరకు బాంబే బ్లడ్ రక్తాన్ని కలిగిన ముగ్గురు వ్యాపారస్థులు అరవింద్ ఉన్న బంగలూరుకు చేరుకున్నారు. అరవింద్‌కు అవసరమైన రక్తాన్ని అందించడమేకాక శస్త్రచికిత్స అనంతరం బాంబే బ్లడ్ క్లబ్‌ను నెలకొల్పారు. నారాయణ్ హృదయాలయకు చెందిన డా. దేవి శెట్టి ఆధ్వర్యంలోని వైద్యుల బృందం అక్టోబర్ మాసాంతంలో అరవింద్‌కు శస్త్రచికిత్సను చేపట్టి విజయవంతం చేశారు.
|