ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మనిషి మెదడులో భాషా కేంద్రం గుట్టు రట్టు
మనిషి మెదడులో భాషకు సంబంధించిన ప్రత్యేక విభాగాన్ని అధునాతన పద్ధతిని ఉపయోగించి కనుగొనడం ద్వారా మానవ భాషా పరిణామంలో కొత్త ఆవిష్కరణకు అవకాశం లభించిందని లండన్ సైంటిస్టులు పేర్కొన్నారు. ఎమోరీ యూనివర్శిటీకి చెందిన ఎర్కెస్ జాతీయ ఆదిమానవ పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రజ్ఞులు, చింపాజీల మెదడుతో మనుషుల మెదడు నిర్మాణాలను పోల్చి చూసేందుకు గాను డిఫ్యూజన్ టెన్సర్ ఇమేజింగ్ అనే ఇమేజింగ్ టెక్నిక్‌ను ఉపయోగించారు. మెదడులో మనిషి భాషతో ముడిపడిన ప్రాంతాలను అనుసంధించే కండర నాడీ తంత్రి మార్గాన్ని వీరు విశ్లేషించారు.

మనిషి. చింపాంజీ మెదడు నిర్మాణాలను పోల్చి చూస్తున్నప్పుడు మనిషి మెదడులోని చాపాకారపు కండర నాడీ తంత్రి చింపాంజీలలోని నాడీ తంత్రికి భిన్నంగా ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. గతంలో జరిగిన ఫంక్షనల్ ఇమేజింగ్ అధ్యయనాల ద్వారా మెదడులోని మధ్య ఖండం మనిషి మాట్లాడే పదాలను విశ్లేషించడంలో నిమగ్నమై ఉన్నట్లు శాస్త్రజ్ఞులు గమనించారు. ప్రస్తుతం అధునాతన పద్ధతి ద్వారా మనిషి మెదడు అతి పెద్ద భాషా ప్రాంతాలను మాత్రమే కాక ఆ భాషా ప్రాంతాలను అనుసంధించే ఫైబర్ నెట్‌వర్క్‌లను కూడా కలిగి ఉన్నట్లు వీరు కనుగొన్నారు. ఈ ఫైబర్ నెట్‌వర్క్ అనేది మనుషులలో భాషా సామర్థ్యాలను అధికంగా పెంచుతోందని ఈ పరిశోధక బృందం నేత జేమ్స్ రిలింగ్ పేర్కొన్నారు.

డిఫ్యూజన్ టెన్సర్ ఇమేజింగ్ అనే టెక్నిక్‌ను కనుగొనక ముందు మెదడు అనుసంధానక్రియలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయడం సైంటిస్టులకు సాధ్యమయ్యేది కాదని ఈ పరిశోధక బృందం పేర్కొంది. మనిషి మెదడులోని అనుసంధానాలను ఇంతకుముందు అధ్యయనం చేయలేకపోయేవారిమని, దీంతో జంతువులతో పోలిస్తే మనిషి ఎక్కడ విభిన్నంగా ఉన్నాడో చెప్పడం కష్టమయ్యేదని వారు తెలిపారు.

ఈ డిటిఐ టెక్నిక్ వల్ల మనం మనుషుల్లాగా ఆలోచించడం, పనిచేయడం, మాట్లాడడం సాధ్యం చేసేలా మనిషి మెదడు వైరింగ్‌ను మానవ పరిణామం ఎలా మార్చిందో తెలుసుకోవచ్చని యేర్కర్ వర్శిటీ స్కాలర్ టాడ్ ప్రేస్ తెలిపారు.

ఈ ఆవిష్కరణ మెదడు గురించిన పరిశోధనలో మైలు రాయి కానుందని తెలిపారు.
మరిన్ని
కంటి చూపు సమస్యపై భారతీయుడి నూతన ఆవిష్కరణ
తగ్గుముఖం పట్టిన క్షయ : తగ్గని మరణాలు
బాల్యంలోనే గర్భధారణ మహా ప్రమాదకారి
మెదడుకు గాయాల నివారణకు తాజా సాఫ్ట్‌వేర్
ఆకలికి చెక్ చెప్పే సరికొత్త సమ్మేళనం
భారత్‌లో 24 లక్షల క్యాన్సర్ కేసులు : డబ్ల్యూహెచ్ఓ