ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > కథనాలు > నిత్యం యవ్వనంగా ఉండటానికి.....
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నిత్యం యవ్వనంగా ఉండటానికి.....
మానవుడు తన జీవితకాలంలో వృద్ధాప్యాన్ని చూడటం సహజం. ఆ వృద్ధాప్యాన్ని సహజంగా ఎవరూ కోరుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నిత్యం యవ్వనస్తులుగానే ఉండాలని కోరుకుంటారు. అయితే నడి వయస్సు నుంచి వృద్ధాప్యంలోకి అడుగు పెట్టే కాలంలో ఆ వేగాన్ని మనం తీసుకునే ఆహారపానీయాల ద్వారా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఈ వయస్సులో తరచూ వచ్చే వ్యాధులను కూడా నియంత్రించగలిగితే శారీరకంగానూ, మానసికంగానూ వృద్ధాప్యాన్ని కొంతకాలం వరకు పొడిగించడానికి వీలవుతుంది. ప్రకృతిపరంగా లభించే ధాన్యాలు, పండ్లు తీసుకోవడం ద్వారా వృద్ధాప్య వేగాన్ని తగ్గించగలిగితే అంతకంటే ఆనందం ఏంవుంటుంది.

పండ్లు ఎక్కువసార్లు తీసుకుంటే బరువెక్కిపోతారన్న అపోహవుంది. సహజంగా అతి తక్కువసార్లు తినేవారే ఎక్కువ క్యాలరీలు తీసుకుంటారు. ముడి ధాన్యాలు, చెర్రీపండ్లు, అవకాడో పండ్లు, ఆప్రికాట్లు, ఆపిల్ పండ్లువంటివి ప్రకృతి సిద్ధంగా లభించేవి.

ఈ ఐదు రకాల సహజసిద్ధమైన ధాన్యాలు పండ్లు వృద్ధాప్యంలో ఎదురయ్యే అతి ప్రధాన సమస్యల నుంచి కాపాడతాయి. వీటి ద్వారా శరీరంలోని అతి కీలకమైన గుండె, కాలేయం, మెదడు, క్లోమగ్రంధి, పిట్యూటరీ గ్రంధి, శ్వాసకోశాలు సక్రమంగా పని చేయడంవల్ల వృద్ధాప్యంలో వచ్చే అత్యధిక సమస్యలకు దూరంగావుండే అవకాశంవుంది. ఫలితంగా ఆరోగ్యం నిలికడగా ఉండటంతోపాటు జీవన ప్రమాణాలూ పెరుగుతాయని పరిశోధకలు పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆరోగ్యానికి పంచ సూత్రాలు
బీపీ ఉందా... ప్రాణాయామం చేయండి
కాలీఫ్లవర్ ఆకులు... ఆరోగ్యప్రదాయిని
సుఖవంతమైన నిద్ర పొందడం ఎలా...
"మంచి కొలెస్ట్రాల్" అవసరమే...!!
బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే "ఆ" అనుభవాలు ఎక్కువట..!