వేడి వేడి టీ
వేడి వేడిగా ఒక కప్పు టీ త్రాగితే మీలోనున్న అలసట దూరమౌతుందన్న మాట వాస్తవమే. కాని వేడి వేడిగా టీ త్రాగితే స్ట్రెస్ హార్మోన్స్ ఏవయితే ఉన్నాయో(గ్లూకోకోర్టీకోయెడ్) వాటిని తగ్గిస్తుందని వైద్యులు తెలిపారు. కాని వేడి వేడి టీ తీసుకోవడం వలన గొంతు క్యాన్సర్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయని ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తేలినట్లు వైద్య బృందం వెల్లడించింది.
చాక్లేట్ తింటే ఆయుష్షు పెరుగుతుంది
చాక్లేట్ అంటే ప్రతివారికి ఇష్టమే. చాక్లేట్‌ను ఇష్టపడని వారెవ్వరూ ఉండరంటే అతిశయోక్తికాదు. నెలకు కనీసం మూడు సార్లు చాక్లేట్‌ను తింటే మీ జీవితంలో మూడు సంవత్సరాల ఆయుష్షు పెరుగుతుందని హావర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. చాక్లేట్‌లను తింటే శరీరంలో హెచ్‌డీఎల్ శాతాన్ని పెంచేందుకు దోహదపడుతుందని పరిశోధకులు వివరించారు. ఇది ఒకలాంటి కొలెస్ట్రాల్. ఇది ఆర్ట్రీజ్‌లో చేరే కొవ్వును చేరనీయదని వైద్యులు తెలిపారు.
ధూమపానం చేస్తున్నారా...!
ధూమపానం చేస్తే రకరకాల క్యాన్సర్‌లు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధే కాకుండా ఇతర జబ్బులుకూడా వస్తాయని వైద్యులు తెలిపారు. కాని ధూమపానం చేసే మనిషి ఆయుష్షు పది సంవత్సరాలు తగ్గిపోతుందని పరిశోధనల్లో తేలినట్లు వైద్యులు తెలిపారు.
ఎక్కువగా నిద్రపోతుంటారా...!
ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరం. అందునా ఆరునుంచి ఏడు గంటల వరకు నిద్ర పోతే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. కాని అదే నిద్ర 9 గంటల కన్నాకూడా ఎక్కువగా నిద్రపోతుంటే ఇది జీవితంలోని ఐదు గంటలను తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలినట్లు వైద్యులు తెలిపారు. కాబట్టి ప్రతి మనిషి శరీరానికి అవసరమైనంతమేరకు నిద్రపోండి. అధికంగా నిద్రపోతే ఆరోగ్యానికి అనర్థదాయకం. |