ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > కథనాలు > లాఫర్ థెరపీని ప్రయోగించండిలా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లాఫర్ థెరపీని ప్రయోగించండిలా...!
Gulzar Ghouse
Content consultent
FILE
నవ్వు అనేది ప్రకృతి మనిషికి ఇచ్చిన ఓ ప్రత్యేకమైన వరం. ప్రకృతిలోని జీవరాశులలో నవ్వు అనేది కేవలం మానవునికి మాత్రమే సాధ్యం. మిగిలిన ప్రాణులకు అది అసాధ్యం. మనిషి మనస్ఫూర్తిగా నవ్వుకోగలడు.

ఒకానొకప్పుడు నవ్వు నాలుగు విధాలుగా చేటు అనేవారు. కాని ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం నిద్ర లేవగానే నవ్వుతూ మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. ఆ రోజంతా నవ్వుతూనే గడిపేస్తారంటున్నారు పరిశోధకులు.

నవ్వడానికి మనం ఎలాంటి రుసుం కాని పన్ను కాని చెల్లించనక్కరలేదు. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా మనస్ఫూర్తిగా నవ్వండి. నవ్వుతో మనసుల్లోని కల్మషం పూర్తిగా తొలగిపోతుంది.

నవ్వుతో మనసు, శరీరంకూడా తేలికగా ఉంటుంది. ఇది మనిషికి ఓ ఔషధంలా పని చేస్తుంది. నవ్వుతో శరీరంలో మార్పులు సంభవిస్తాయని కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్. లీ బర్క్ తెలిపారు.

**నవ్వడం వలన మనిషి శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ను సక్రమమైన మార్గంలో ఉంచుతుంది.

** దీంతో ప్రకృతి పరమైన కిల్లర్ సెల్స్ ఏవైతే మనిషి శరీరంలో ఉత్పత్తి అవుతాయో అలాంటివాటిని నవ్వు వలన ఇవి నష్టపోతాయని ఆయన తెలిపారు.

** నవ్వు అనేది మనిషి హృదయానికి మంచి వ్యాయామం. ఇది టీ సెల్స్ సంఖ్యలను పెంచుతుంది.

** నవ్వడంతో యాంటీబాడీ ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఏ సంఖ్యను బాగా పెంచుతుంది. ఇది శ్వాసక్రియలో జరిగే మార్పులు, ఇందులో వచ్చే వ్యాధి సంక్రమణను నిరోధిస్తుంది.

** మనిషి నవ్వడంతో శరీరంలో పెరిగే ఒత్తిడిని తగ్గించే హర్మోన్స్ పెరుగుతాయి. నవ్వుతో ముఖం, గొంతుకు సంబంధించిన వ్యాయామం బాగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

**నవ్వుకు ప్రతిగా ఇప్పుడు చాలామంది తమ ఇళ్ళల్లో లాఫింగ్ బుద్ధాను పెట్టుకుంటున్నారు. లాఫింగ్ బుద్ధాను అత్యధికులు గిఫ్ట్‌గా ఇస్తున్నారు. దీంతో తమ జీవితాలలో నవ్వులే నవ్వులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రాత్రిపూట మూత్ర విసర్జనతో ఆరోగ్యానికి ముప్పు
ఐస్‌క్రీమ్‌తో వేసవి తాపాన్ని పోగొట్టుకోండి
తియ్యటి తేనెతో మధురమైన ఆరోగ్యం
ఆరోగ్యంకోసం వీటిని పాటించండి...!
ఆరోగ్యంకోసం వీటిని పాటించండి...!
నిత్యం చలాకీగా ఉండండిలా...!