ఇరుగు, పొరుగు వాళ్లతో పోచుకోలు కబుర్లు మనకెందుకు అనుకుంటాం కానీ, ఈ కబుర్లకు ఒత్తిడిని తగ్గించే శక్తి ఉందట. ఎవరికీ ఇబ్బంది కలిగించని, హానిలేని రీతిలో చెప్పుకునే ఇచ్చకాలు ఒకింత సంతోషాన్ని కలిగిస్తాయట. ఏదో ఒక పక్కకు ఇద్దరు కనుక వెళితే ఆ వెళ్లినవారి గురించి మూడో వ్యక్తి చెవులు కొరకటం సహజమే.వాళ్లిద్దరి మధ్య ఉన్న చనువు, వాళ్ల లైఫ్ స్టయిల్ వంటివాటి గురించి మరో వ్యక్తితో చెప్పే గాసిప్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పరిశోధకులు చెపుతున్నారు. ఇలాంటి మాటల వల్ల వినోదం కలిగి ఒత్తిడి పటాపంచలవుతుందట.సెలబ్రెటీలు, బాస్, సహచరులు, సహోద్యోగులు, బంధువులు, స్నేహితులు ఇలా ఎవరి గురించిన అంశాలైనా అప్పుడప్పుడు గాసిప్ జాబితాలోకి వచ్చి చేరుతుంటాయి. ఇంట్లో, ఆఫీసులో, పార్టీలో, ఫంక్షన్లో ఎక్కడైనా ఈ కబుర్లకు వేదిక చేసుకోవచ్చు. జీవితంలోని కష్టాలను తప్పించుకునే మార్గం ఈ గుసగుసలు. అన్నిటికీ మించి గాసిప్ మంచిది కావాలేతప్ప ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండరాదు. |