ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > కథనాలు > యువత...! డైటింగ్ చేస్తున్నారా... జాగ్రత్త...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యువత...! డైటింగ్ చేస్తున్నారా... జాగ్రత్త...!
Gulzar Ghouse
Content consultent
కిశోరావస్థనుంచి శరీరంలో ప్రతి అంగంలోనూ మార్పులు జరుగి పెరుగుతుంటాయి. ఒకానొక సమయంలో వీటి పెరుగుదల ఆగిపోతుంది. మీరు ఎంత ప్రయత్నించినాకూడా శరీరాంగాలు పెరగవు. పెరిగే వయసు కాబట్టి పిల్లలు యుక్త వయస్సుకు చేరుకునే సమయంలో శరీరం తనలోని భాగాలకు కాసింత మెరుగులు ఇస్తుంది. ఈ మార్పు జీవితాంతం ఉంటుంది.

యుక్త వయసులోకి చేరేటప్పుడు శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండేందుకు శరీరానికి తగినంత క్యాల్షియం అవసరం అవుతుంది. ఇలాంటి స్థితిలో డైటింగ్(ఉపవాసం)చేస్తే శరీరానికి కావలసిన క్యాలరీలు, పోషక పదార్థాలు అందవ్వు. ఇవి శరీరం పెరగడానికి దోహదపడుతాయి. ఒకవేళ మీరు డైటింగ్ ప్రారంభిస్తే మీ ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ముఖ్యంగా అమ్మాయిలలో నెలసరిని అడ్డుకుంటుంది. అబ్బాయిల్లోనైతే శరీరం ఎదుగుదలలో మార్పులు జరగవంటున్నారు వైద్యులు. పౌష్టిక ఆహారం తీసుకోవడం ఏమంత కష్టమైన పనికాదు. కాని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటున్నారు వైద్యులు.

కాయగూరలు, పండ్లు, బ్రెడ్, ధాన్యం, బియ్యం, పాలు-పెరుగు, వెన్న, మాంసం, కోడిమాంసం, చేపలు, వేరుశెనగలు, పప్పు దినుసులు, పచ్చి బఠాణీలు, కోడిగ్రుడ్లు ఇలా విటమిన్లున్న ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి ఎంతో మంచిది.

మీకు ఇష్టమైన ఆహార పదార్థాలలో కొవ్వుశాతం తక్కువగా ఉండేటట్లు చూసుకోండి. పండ్లు, కాయగూరల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. వివిధ రకాల ఆహార పదార్థాలను స్వీకరించండి.

ఒకవేళ మీ బరువు అధికంగా ఉంటే వైద్యులు మీ బరువును తగ్గించండని సూచిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయం కేవలం వ్యాయామం చేయడమే ప్రధానం.

వైద్యులు మీ శరీర బరువును తగ్గించమని సూచిస్తే మీరు తీసుకునే ఆహారంలో పరిమాణం తగ్గించండి. కొవ్వున్న ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారంగా తీసుకోకండి.

అతి తక్కువ క్యాలరీలుగల ఆహారం తీసుకోండి.

ద్రవ పదార్థాలను వీలైనంత ఎక్కువగా తీసుకోండి.

సరైన సమయానికి ఆహారం తీసుకుంటుండాలి. సమయానుసారం ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అల్పాహారం తీసుకోవడం మాత్రం మానేయకండి.

ఎలాంటి పరిస్థితుల్లోనూ డైట్-పిల్స్‌పై తీసుకోకూడదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
యూరిన్ టెస్టుతో క్షయవ్యాధి నిర్ధారణ
నేడే ప్రపంచ ఉపవాస దినోత్సవం
గాలి కబుర్లు ఆరోగ్యానికి మంచివేనట
పాదాల పగుళ్ళకు కారణం...!
"స్వైన్ ఫ్లూ" పనిబట్టే "ఎరోసైడ్" టెక్నాలజీ...!
లాఫర్ థెరపీని ప్రయోగించండిలా...!