ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > కథనాలు > మెదడు భావోద్వేగాలలో "ఆడిటరీ కార్టెక్స్" పాత్ర
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మెదడు భావోద్వేగాలలో "ఆడిటరీ కార్టెక్స్" పాత్ర
FILE
మన స్నేహితులతోనో, తల్లిదండ్రులతోనో, తోబుట్టువులతోనో మాట్లాడుతున్నప్పుడు.. లేదా వారు చెప్పేది వింటున్నప్పుడు.. వాళ్ళు కోపంగా మాట్లాడుతున్నారా, సరదాగా జోకులేస్తున్నరా... లేదా మనం కోపంగా ఉన్నామా, లేదా సరదాగా ఉన్నామా అన్న విషయాలు మనకు ఇట్టే అర్థమవుతుంటాయి.

ఇలా మనుషుల వివిధ రకాల భావోద్వేగాలతో పాటు బయటికి వచ్చే మాటలు ఒక్కోలా మనిషి మెదడులోని "ఆడిటరీ కార్టెక్స్" అనే భాగంపై ముద్ర వేస్తాయి. ఒక్కో భావాన్ని వింటున్నప్పుడు మెదడులోని ఈ కార్టెక్స్‌లో ఒక్కో ప్రక్రియ జరుగుతుందని, ఎదుటివారి మాటల్లోని భావాన్నిగుర్తించటంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తాజా పరిశోధనల్లో కనుగొన్నారు.

వివరాల్లోకి వస్తే... జెనీవాలోని యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో "ఆడిటరీ కార్టెక్స్" విధుల గురించి కూలంకషంగా అధ్యయనం జరిపారు. ఇందులో భాగంగా వీరు 22 మంది వ్యక్తులకు... ఒకే డైలాగ్‌ను ఒక నటుడిచేత కోపం, నవ్వు, ఉద్వేగం, ఆక్రోశం ప్రతిఫలించే విధంగా వినిపించారు.

ఈ సమయంలో పై 22 మంది మెదళ్లలో జరిగిన చర్యలను ఫంక్షనల్ మాగ్నటిక్ రిసోర్స్ ఇమేజింగ్ విధానం ద్వారా పరిశోధకులు చిత్రీకరించారు. మల్టీ వేరియేట్ ప్యాటర్న్ ఎనాలిసిస్ (ఎంవీపీఏ) అనే పద్ధతి ద్వారా వాటిని పరిశీలించారు. ఒక్కో భావాన్ని విన్నప్పుడు మెదడులోని ఆడిటరీ కార్టెక్స్‌లో ఒక్కో ప్రక్రియ జరుగుతున్నట్లుగా వీరు గమనించారు.

ఇదిలా ఉంటే... ఇప్పటిదాకా ఈ ఆడిటరీ కార్టెక్స్‌ను పరిశోధకులందరూ సంవేదనాత్మక నాడి వంటి భాగంగానే గుర్తించారు. అయితే ఈ పరిశోధనల వల్ల కార్టెక్స్ ఆలోచనాత్మక విధులను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తుందని పరిశోధకులు ఒక నిర్ణయానికి వచ్చారు. కాగా... ఈ తాజా అధ్యయన ఫలితాలు స్కిజోఫ్రీనియా రోగులలో మెదడు సరిగా పనిచేయకపోవటానికి గల కారణాలను కనుగొనేందుకు బాగా ఉపకరిస్తాయని ఈ పరిశోధకులు చెబుతున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
యువత...! డైటింగ్ చేస్తున్నారా... జాగ్రత్త...!
యూరిన్ టెస్టుతో క్షయవ్యాధి నిర్ధారణ
నేడే ప్రపంచ ఉపవాస దినోత్సవం
గాలి కబుర్లు ఆరోగ్యానికి మంచివేనట
పాదాల పగుళ్ళకు కారణం...!
"స్వైన్ ఫ్లూ" పనిబట్టే "ఎరోసైడ్" టెక్నాలజీ...!