ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > కథనాలు > ఆఫీసులో ఆరోగ్యంగా ఉండండిలా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆఫీసులో ఆరోగ్యంగా ఉండండిలా...!
FILE
ఆరోగ్యంగా, ఫిట్‌నెస్‌తో కూడుకుని కార్యాలయంలో పనిచేయడం ఎంతో లాభదాయకం. దీనికి నిత్యం పనులతో సతమతమౌతుంటేకూడా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండిలా...

మీరు పని చేసే కార్యాలయంలో కూర్చుని పనిచేసేదిగా ఉంటే మధ్య-మధ్యలో అటూ, ఇటూ తిరగండి. మీరు చేసేపనిలో ఫైళ్ళు, రిజిస్టర్లు తదితరాలను మీరే స్వయంగా వాటిని అందుకునే ప్రయత్నం చేయండి. అలాగే తిరిగి వాటిని మళ్ళీ యథా స్థానంలో ఉంచేందుకు ప్రయత్నించండి.

మధ్యాహ్నం భోజనం ముగించిన తర్వాత మీ కేబిన్‌లోనే అటూ, ఇటూ తిరగండి. వీలైనంత మేరకు కనీసం 15 నుంచి 20 నిమిషాలపాటు కార్యాలయంలోనే నడక ప్రారంభించండి. దీంతో మీ శరీరానికి వ్యాయామం చేసినట్లౌతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

మీరు ఉదయం పూట కార్యాలయానికి వెళ్ళేముందు ఇంటినుంచే అల్పాహారాన్ని సేవించి మరీ వెళ్ళండి. అంతగా తీరిక లేకపోతే ఇంటినుంచే పార్శిల్ చేసుకుని వెళ్ళి మీరు పని చేసే కార్యాలయంలోనే అల్పాహారాన్ని ముగించండి.

ఉదయం ఎట్టి పరిస్థితుల్లోనూ అల్పాహారం తినకుండా ఖాళీ కడుపుతో ఉండకూడదంటున్నారు వైద్యులు. కొందరు టీలు, కాఫీలు తాగి సమయం గడిపేస్తుంటారు. ఇది వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు.

కొన్ని సందర్భాలలో మీరు కార్యాలయం పనిమీదుగా బయటికి వెళ్ళే సందర్భాలున్నప్పుడు మధ్యాహ్నం రెస్టారెంట్లో భోజనం తీసుకునే పరిస్థితి తలెత్తినప్పుడు ఎక్కువగా సలాడ్, సూప్ మొదలైనవి తీసుకోండి.

వేంచిన పదార్థాలను భుజించకండి. మీ ఆరోగ్యానికి సరిపడా భోజనాన్ని మాత్రమే తీసుకోమని సూచిస్తున్నారు వైద్యులు.

వేసవికాలంలో చల్లటిపానీయాలు తీసుకునేటప్పుడు వాటిలో రసాయనాలు కలిపినవి అయితే మాత్రం సేవించకుండా ఉండటం ఉత్తమం అంటున్నారు వైద్యులు. ఉదాహరణకు కొబ్బరి నీళ్ళు, షరబత్, నిమ్మకాయ రసం, తదితర పండ్ల రసాలను అధికంగా తీసుకోండి.

మీరు కార్యాలయంలో పనిచేస్తూ బాగా అలసిపోయనట్లనిపిస్తే విశ్రాంతి ముద్రలో కూర్చోండి. కళ్ళుమూసుకుని అలా ఓ పదినిమిషాలపాటు ధ్యానం చేయండి. దీంతో మళ్ళీ మీలో నూతనోత్తేజం పుట్టుకొస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"ఎండ్రకాయ డొప్ప"లతో నాడీ చికిత్స
ఆరోగ్యానికి కమ్మటి నిద్ర
పొగాకుతో నష్టాలున్నాయా...?
తండ్రి జన్యువులతోనే ఆరోగ్యమైన సంతానం
నడుం.. వెన్నునొప్పులు ఎలా పోతాయి?
కంప్యూటర్‌తో స్నేహమా...! హవ్వ