ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > కథనాలు > బట్టతల బాధితులకు "కాలిక్యులేటర్" భరోసా...!!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బట్టతల బాధితులకు "కాలిక్యులేటర్" భరోసా...!!
FILE
ఇంకా పాతికేళ్లు కూడా నిండలేదు, అప్పుడే బట్టతల వచ్చేసింది... ఇక నన్నెవరు పెళ్లి చేసుకుంటారని భారంగా గడుపుతున్న యువకులకు ఓ మంచి వార్త...! అదేంటంటే... బట్టతల ప్రమాదం నుంచి బయటపడే అవకాశాన్ని తాము రూపొందించిన కాలిక్యులేటర్ కల్పిస్తుందని జర్మనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బట్టతల ఎప్పుడు వస్తుంది, ఏ వయస్సులో తల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయన్న విషయాలనే కాకుండా... నెత్తిమీది వెంట్రుకల బలాలు, బలహీనతలను ఖచ్చితంగా కొలిచే ఒక కంప్యూటర్‌ను ఈ జర్మన్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. "బట్టతల కాలిక్యులేటర్"గా పిలిచే ఈ కంప్యూటర్ సాయంతో బట్టతల రాకుండా ముందే జాగ్రత్తపడే అవకాశం ఉంటుందని వారంటున్నారు.

శిరోజాల సంరక్షణ ఔషధాలను తయారుచేసే డాక్టర్ కర్ట్ వుల్ఫ్ సంస్థ చేసిన పరిశోధనల్లో డాక్టర్ అడాల్ఫ్ క్లెంక్ ఈ కాలిక్యులేటర్‌ను రూపొందించారు. ఈ విషయమై క్లెంక్ మాట్లాడుతూ... బట్టతలతో బాధపడుతున్న యువకులకు ఈ పరికరం ఊరట కలిగిస్తుందన్నారు. సాధారణంగా బట్టతల వచ్చేందుకు వంశపారంపర్య జన్యువులు కారణాలుగా ఉంటాయని క్లెంక్ వివరించారు.

అదే కాకుండా తీవ్ర మానసిక ఒత్తిడులు, జీవిత భాగస్వామితో విడాకులు తీసుకోవడం, సన్నిహితులను ఆకస్మికంగా కోల్పోవడం లాంటివి కూడా బట్టతలకు కారణాలుగా చెప్పవచ్చన్నారు. కంప్యూటర్ విశ్లేషణ అనంతరం పరిస్థితిని ఖచ్చితంగా అంచనా వేసి, తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలావరకు బట్టతల రాకుండా బయటపడవచ్చునని క్లెంక్ భరోసా ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే... ప్రపంచవ్యాప్తంగా ఇరవై సంవత్సరాలు నిండిన యువకుల్లో నుదురు రెండువైపులా సమానంగా వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. బట్టతల ఏర్పడేందుకు ఇదే అంకురార్పణ అని చెప్పవచ్చు. అయితే జర్మన్ శాస్త్రవేత్తలు రూపొందించిన కంప్యూటర్‌కు అలాంటి యువకులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయాలి.

ఆ యువకుల వయస్సు, వివాహం అయిందా, లేదా.. చేస్తున్న ఉద్యోగం, నివసించే ప్రాంతం, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్య చరిత్ర, ప్రస్తుతం వెంట్రుకలు రాలుతున్న శాతం, మిగతా ఒత్తిడిని కలిగించే అంశాలన్నింటినీ ఈ కంప్యూటర్‌లో పొందుపరచిన తరువాత బట్టతల అంశాన్ని విశ్లేషిస్తారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రక్తదానంపై అపోహలు వద్దు...!
సంగీతంతో "హృదయం" పదిలం...!!
ఆఫీసులో ఆరోగ్యంగా ఉండండిలా...!
"ఎండ్రకాయ డొప్ప"లతో నాడీ చికిత్స
ఆరోగ్యానికి కమ్మటి నిద్ర
పొగాకుతో నష్టాలున్నాయా...?