ప్రయాణం చేసేటప్పుడు కొన్ని అనుకోని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అలాగే కొన్ని జబ్బులున్నవారు ప్రయాణం చేసే సందర్భంలో ఇబ్బందులకు గురౌతుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఇబ్బందులనుంచి బయటపడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వాంతులు : కొందరికి ప్రయాణం చేసే సమయంలో వాంతులు చేసుకుంటుంటారు. అది కారు, విమానం, బస్సులలో ప్రయాణం చేసినప్పుడుకూడా అనాయాసంగానే వాంతులు వస్తుంటాయి. అలాగే ప్రయాణం చేసేటప్పుడు బీడీ, సిగరెట్ పొగ ద్వారా కూడా వాంతులు చేసుకుంటుంటారు. మరి కొందరికి కళ్ళు తిరిగినట్లుంటుంది. ఇలాంటి వారు ప్రత్యేకంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.
** ప్రయాణం చేసేటప్పుడు గాలి వచ్చే స్థానంలో కూర్చోండి.
** ప్రయాణం చేసే సందర్భంలో వదులుగా ఉన్న బట్టలను ధరించండి. దీంతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.
** ప్రయాణానికి ముందు భోజనం చేయాల్సివస్తే తేలికపాటి భోజనం చేయండి. ** మరీ ఖాళీ కడుపుతో ప్రయాణం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
** ఉదయంపూటైతే తేలికపాటి అల్పాహారం చేయండి.
** ప్రయాణంలో బయటకు తొంగి చూడటం మానండి. అలా తొంగి చూస్తే కళ్ళు తిరిగినట్లుంటుంది. దీంతో వాంతులు వచ్చే అకాశం ఉందంటున్నారు వైద్యులు.
** ప్రయాణం చేసే సమయంలో ఎదురుగా రహదారిపై మీ దృష్టిని పెట్టండి.
** మీ మెడ భాగం నిటారుగా ఉంచండి. దీంతో ప్రయాణంలో కుదుపులు వచ్చినప్పుడు మెడ భాగానికి ఏ ఇబ్బంది తలెత్తదంటున్నారు ఆరోగ్యనిపుణులు.
** మీరు ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయ, యాలకలు, లవంగాలు, పుదీనా, ఆరెంజి మిఠాయిలు మీ వెంట తీసుకు వెళ్ళండి. ** ప్రయాణం చేసే సందర్భంలో మీరు తీసుకువెళ్ళే నీటిలో కాస్త గ్లూకోజ్ కలిపుకోండి లేదా నిమ్మకాయరసం కలుపుకువెళ్ళండి. దీంతో ప్రయాణంలో దాహం వేసినా లేదా వాంతులు వచ్చేట్టున్నాకూడా రావంటున్నారు వైద్యులు. |