ఆధునిక జీవన విధానం గుండె మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నది. శరీర భాగాల్లో అన్నింటికన్నా వేగంగా పాడవుతున్న భాగం గుండె. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి రోజూ 45 నుంచి 60 నిమిషాలు నడకకు కేటాయించాలి. నడిచేటపుడు కాస్త వేగాన్ని పెంచి నడిస్తే మంచిది. ఒకవేళ మధ్యమధ్యలో నడకను కొనసాగించలేకపోయినట్లయితే కనీసం వారంలో మూడు రోజులైనా దీనికి సమయాన్ని కేటాయించాలి. తీసుకునే ఆహారంలో శాకాహారం ఎంతో మేలు చేస్తుంది. ఇక మాంసాహారాన్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. కోడిమాంసం తినేవారు ఆ అలవాటును వారానికి ఒకసారికే పరిమితం చేసుకోవాలి. చేప మాంసాన్ని ప్రతి రోజూ తీసుకున్నా ఫర్వాలేదు. ఉప్పు, నూనెలు అధికంగా వాడిన పదార్థాలను ఏమాత్రం తీసుకోకూడదు. పొగతాగే అలవాటున్నవారు ఆ అలవాటును మానుకోవాలి. బరువులో మార్పులు రానివ్వకూడదు. మత్తు పానీయం తీసుకునేవారు ఆ అలవాటుకు స్వస్తి చెప్పటానికి ప్రయత్నం చేయాలి. ఇక చిప్స్, పిజ్జాల వంటి జంక్ ఫుడ్‌ను పూర్తిగా నిషేధించాలి. |