1 **శాఖాహరం తీసుకుంటే శరీరంలో జీర్ణక్రియ చాలా త్వరగా జరుగుతుంది. ఇది మీ మస్తిష్కాన్ని చైతన్యంవంతం చేసి బుద్ధిమంతులుగా తీర్చిదిద్దుతుందంటున్నారు వైద్యులు. అదే మాంసాహారం తీసుకుంటే జీర్ణం కావడానికి దాదాపు 36 నుంచి 60 గంటలు తీసుకుంటుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. దీంతో అనారోగ్యంబారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు. 2 ** కాయగూరల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్‌తోపాటు శరీరానికి కావలసిన మిగిలిన పోషక పదార్థాలు కూడా అందులో ఉంటాయి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్ తదితరాలుంటాయి. ఇవి క్యాన్సర్‌లాంటి భయంకరమైన వ్యాధులనుంచి కాపాడుతాయంటున్నారు వైద్యులు.3 ** శాఖాహారంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. వీటితోపాటు శాఖాహారం భోజనంలో విటమిన్ బీ12 తక్కువగా ఉంటుందని చాలామంది చెపుతుంటారు. కాని దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవు. అందునా మన శరీరానికి విటమిన్ బీ12 తక్కువ మోతాదులోనే అవసరమౌతుందంటున్నారు వైద్యులు. చాలామంది శాఖాహారం తీసుకుంటే శరీరానికి తగిన క్యాలరీలు అందవని అపోహ పడుతుంటారు. కాని ఇది ఎంతమాత్రం నిజంకాదని వైద్యులు చెపుతున్నారు. శాఖాహారం తీసుకునేవారిలో అన్నిరకాల పోషకవిలువలున్న ఆహారపదార్థాలు తీసుకుంటే క్యాలరీలుకూడా వాటంతట అవే శరీరానికి సమకూరుతాయంటున్నారు వైద్యులు. |