ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > కథనాలు > ఆరోగ్యంగా ఉండండిలా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆరోగ్యంగా ఉండండిలా...!
FILE
శరీరంలోని కొవ్వును అదుపులో ఉంచుకునేందుకు గోరువెచ్చగా వేడి చేసిన పదిగ్రాముల పుదీనా రసాన్ని ప్రతి రోజూ ఉదయం పరకడుపున సేవించాలి. దీంతో రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు వైద్యులు.

పాలలో కనీసం మూడు గ్రాముల పసుపుపొడిని కలుపుకుని నిత్యం సేవిస్తుంటే కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు.

ఉదయంపూట పరకడుపున వెల్లుల్లి పలుకులను సేవిస్తే కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు వైద్యులు.

మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఐదునుంచి పది గ్రాముల నేరేడు గింజల చూర్ణాన్ని ఉదయంపూట సేవించాలి. కాకారకాయ రసం సేవిస్తే కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు.

హృద్రోగంతో బాధపడేవారికి నిత్యం తక్కువ కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోమని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. ఇలాంటి సందర్భంలో వీరి ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు తగ్గిపోతాయి.

దీంతో గుండెకు అందవలసిన శక్తి సరిగా అందదు. ఈ విధంగాకూడా వారిలో వ్యాధి ఎక్కువయ్యే సూచనలు కనపడుతాయి. ఇలాంటి సందర్భంలో ఆపిల్, దానిమ్మపండ్ల రసాలు, ఉసిరికాయ తీసుకున్నాకూడా గుండెకు బలాన్ని చేకూరుస్తాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే గుండె సక్రమంగా పనిచేస్తుందని వైద్యులు చెపుతున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శాఖాహారంతో బుద్ధిమంతులుకండి...!
గుండె ఆరోగ్యంకోసం ఏం చేస్తున్నారూ...?
ప్రయాణంలో ఆరోగ్యం !
ధూమపానంతో మెదడుకు చేటు...!
బట్టతల బాధితులకు "కాలిక్యులేటర్" భరోసా...!!
రక్తదానంపై అపోహలు వద్దు...!