మామిడి పండ్లను ఇష్టపడనివారు ఈ లోకంలో ఉండరంటే అతిశయోక్తికాదు. ఇదే మామిడి పండును తినాలన్నాకూడా కేవలం వసంత ఋతువులోనే తినాలి. ఇవి మళ్ళీ దొరకవు. వీటిని తింటే ఆరోగ్యానికి చాలామంచిదని వైద్యులుకూడా సూచిస్తున్నారు.
శరీరం కాలినప్పుడు : మామిడి ఆకులను కాల్చి, బూడిద చేసి ఈ భస్మాన్ని కాలినగాయాలపై చిలకరించండి. దీంతో కాలిన గాయం మానుతుందంటున్నారు వైద్యులు.
నిద్రలేమి : నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునేముందు ఓ మామిడి పండును తినండి. లేదా పాలు త్రాగండి. దీంతో సుఖంగా నిద్రపడుతుందంటున్నారు వైద్యులు.
కడుపులో నులిపురుగులుంటే : పిల్లలకు తరచూ నులిపురుగుల సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యనుంచి ఉపశమనం కలగాలంటే మామిడి ముట్టిని చూర్ణంలా చేసుకుని వేడినీటిలో కలిపి ఇస్తే నులిపురుగుల సమస్యనుంచి ఉపశమనం మటుమాయం అంటున్నారు వైద్యులు.
దంతాలు గట్టిగా ఉండాలంటే : మామిడి తాజా ఆకులను బాగా నమలండి. నమిలినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. దీనిని ఉమ్మేయండి. ఇలా నిత్యం చేస్తుంటే దంతాలు కదులుతుంటే దృఢంగా తయారవుతాయి. అలాగే చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటేకూడా తగ్గుదల కనపడుతుందంటున్నారు వైద్యులు. |