ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > కథనాలు > నిత్య యవ్వనులుగా ఉండండిలా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నిత్య యవ్వనులుగా ఉండండిలా...!
Gulzar Ghouse
Content consultent
FILE
1** నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయంపూట త్వరగా నిద్రనుండి మేల్కొనాలి. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత పరకడుపున నిమ్మకాయ రసం సేవించాలి లేదా రాగి పాత్రలో రాత్రి పోసి పెట్టిన నీటిని సేవించండి. దీంతో ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్యులు.

2** ఉదయం, సాయంత్రం తేలికపాటి వ్యాయామం చేయండి. సాధారణంగా రెండుపూటలా నడక ప్రారంభించండి. ముఖ్యంగా కాలుష్యం లేని ప్రాంతంలో తిరిగేందుకు ప్రయత్నించండి.

3** మీరు తీసుకునే అల్పాహారంలోను, భోజనంలోనూ రుచికరమైన ఆహార పదార్థాలుండేలా చూసుకోండి.

4** పాచిపోయిన, కుళ్ళిపోయిన, మాడిపోయిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి. దీంతో అనారోగ్యంబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నయంటున్నారు వైద్యులు.

5** నిత్యం ఎన్నో పనులతో సతమతమవుతుంటారు. ఇందులో భాగంగా శరీరానికి, ఆరోగ్యానికి సంబంధించినంతవరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం విచారకరం. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ స్నానం, ప్రార్థన చేయడం మరువవద్దు.

6** శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు స్నానం చేయడం ఎంతో అవసరం. అలాగే మనసును పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రార్థనకూడా ముఖ్యం. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు అనారోగ్యం శరీరంలోకి జొరబడదంటున్నారు విశ్లేషకులు.

7** ఈ రెండు పనులుకూడా తప్పనిసరిఅనికాకుండా మీ జీవితంలో నిత్యకృత్యం అని మీరు భావించాలి. అదికూడా మీరు మనస్పూర్తిగా చేయాలంటున్నారు వైద్యులు.

8** మీరు తీసుకునే విశ్రాంతిలోను, నిద్రలోను ఎలాంటి లోటు రాకుండా చూసుకోండి. ఇవి రెండు మీ ఆరోగ్యానికి ఓ టానిక్‌లా ఉపయోగపడుతుంది. దీంతో మీ శరీరం, మనసు ఉత్సాహంగా ఉరకలు వేస్తుందంటున్నారు వైద్యులు.

9** ఎప్పుడుకూడా పని దొంగగా మారకండి. మీకు వీలైనంత పని మీరు చేయండి. శారీరక శ్రమ, మానసిక శ్రమ చేయండి. అదికూడా ప్రశాంత వదనంతో చేయండి. అలసట అనేది శరీరానికి అవసరం. దీంతో శరీరం మళ్ళీ శక్తిని పొందేందుకు తహతహలాడుతుందంటున్నారు వైద్యులు.

10** ప్రతి కార్యాలయంలో వారానికి ఒకరోజు సెలవు ఉంటుంది. అలాగే మీ శరీరంలోని ఉదరానికి కూడా కాస్త విశ్రాంతినివ్వండి. అంటే ఒకపూట ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి.

11** వ్రతాల పేర్లు చెప్పి శరీరాన్ని బలహీనపరచకూడదు. అంటే ఏ ఆహార పదార్థం తీసుకోకుండా ఉండకూడదు. కాని ఉపవాసం ఉన్నప్పుడు నిమ్మకాయ రసం, మజ్జిగ లేదా పండ్ల రసం సేవిస్తుండాలి.

12** మీలో ఆత్మ విశ్వాసం పెంచుకునేందుకు ప్రయత్నించండి. భగవంతునిపై నమ్మకం ఉంచండి. మీరు శుఖంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి.

13** మీరు వివాహితులైతే రతిక్రీడలో సమతుల్యత పాటించండి. ఏదో తూతూ మంత్రంగా అయిందని మాత్రం అనిపించకండి. రతిక్రియ అనేది జీవితంలో ఓ గొప్ప వరం. ఇందులో సమతుల్యత పాటించి,

14** భార్యా-భర్తలు ఇద్దరూ కలిసి రతిక్రియలో సుముఖంగా పాల్గొని ఆనందించండంటున్నారు ఆరోగ్యనిపుణులు. దీంతో శరీరం కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటుందంటున్నారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా రతిక్రియలో పాల్గొంటే స్వర్గసుఖాలను అనుభవించవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మామిడితో మధురమైన ఆరోగ్యం
ఆరోగ్యంగా ఉండండిలా...!
శాఖాహారంతో బుద్ధిమంతులుకండి...!
గుండె ఆరోగ్యంకోసం ఏం చేస్తున్నారూ...?
ప్రయాణంలో ఆరోగ్యం !
ధూమపానంతో మెదడుకు చేటు...!