ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > కథనాలు > మన అబ్బాయిలు "చాలా మంచోళ్లు"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మన అబ్బాయిలు "చాలా మంచోళ్లు"
FILE

మన యువత అంటే నిత్యం పార్టీలు, పబ్‌లు, అర్ధరాత్రి తిరుగుళ్ళు తిరుగుతుండేవారని సంప్రదాయవాదులు తేల్చిపారేసినా... "మన అబ్బాయిలు చాలా మంచోళ్ల"ని తాజా సర్వే ఒకటి బల్లగుద్ది మరీ చెబుతోంది. నాణానికి ఓవైపు చూసి మాత్రమే అంచనావేసే సంప్రదాయవాదుల మాటలను పక్కనబెట్టి చూస్తే... సగటు భారతీయ యువకుడు చాలా బుద్ధిమంతుడట. ఎంత బుద్ధిమంతుడంటే... మద్యం పేరెత్తితే ఆమడదూరం జరిగేస్తాడట. ఇదంతా వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా, నిజంగా నిజం సుమండీ..!!

వివరాల్లోకి వస్తే... ప్రఖ్యాత రచయితలైన పీటర్ రోనాల్డ్ డిసౌజా, సంజయ్ కుమార్, సందీప్ శాస్త్రిలు.. మనదేశ వ్యాప్తంగా ఉండే 5 వేల మంది యువతతో సుదీర్ఘంగా ఒక సర్వేను జరిపారు. ఇందులో 64 శాతంమంది యువకులు మద్యం తమకు ఆమోదయోగ్యం కాదని సెలవియ్యగా.. ప్రతి పదిమందిలో ఒకరు మాత్రమే తాము మద్యం తాగుతామని బదులిచ్చినట్లు తెలుస్తోంది.

సర్వేలో భాగంగా జరిగిన సుదీర్ఘమైన చర్చల్లో పై రచయితలు... యువత అభిప్రాయాలు, అభిరుచులు, అలవాట్లు, జీవనశైలి, వివిధ అంశాలపై వారి దృక్పథం, ఆధునికత, అభివృద్ధి, ప్రపంచీకరణ, నిరుద్యోగం, ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వాటిని క్రోడీకరించి "ఇండియన్ యూత్ ఇన్ ఏ ట్రాన్స్‌ఫార్మింగ్ వరల్డ్ : ఆటిట్యూడ్స్ అండ్ పర్‌స్పెషన్స్" అనే పుస్తకానికి రూపాన్నిచ్చారు. వాస్తవంగా పార్టీలు, పబ్‌లు, పట్టణ సంస్కృతి, విద్యార్హతలు, స్నేహితులు, సామాజిక పరిస్థితులు యువతను మద్యంవైపు మళ్లేలా చేస్తాయి. కానీ... విచిత్రంగా తాము మద్యానికి దూరమని 2/3వంతు యువకులు వెల్లడించడం ఆశ్చర్యం కలిగిస్తోందని రచయితలు వ్యాఖ్యానించారు.

వీరి పరిశీనలో యువత చెప్పిన విషయాల ప్రకారం... సమాజంలో విస్తృత పరిచయాలు పెంచుకునేందుకే తాము మందు పుచ్చుకుంటున్నామని ప్రతి పదిమందిలో ఒకరు చెప్పగా, పది శాతం మంది మాత్రం ఎలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చలేదు. అలాగే 3/4 వంతు మహిళలు మద్యంవైపు కన్నెత్తి చూడమని పేర్కొనగా, ప్రతి పదిమందిలో ఒక మహిళ మాత్రమే సమాజంలో పరిచయాలు పెంచుకునేందుకు మద్యం సేవిస్తున్నట్లు బదులిచ్చారు.

మద్యంతో పాటు అనేక అంశాలపై సేకరించిన యువత అభిప్రాయాలను సేకరించిన రచయితలు పై పుస్తకంలో విపులంగా పొందుపరిచారు. దీన్నిబట్టి చూస్తే... భారతీయ యువతకు మద్యంపైన అంతగా ఆసక్తి లేదన్నమాట. ఇకనైనా సంప్రదాయవాదులు, వయసుమళ్లిన పెద్దవారు యువతకు రెండోవైపున ఉన్న ఈ కోణాన్ని కూడా చూస్తే మంచిదేమో కదూ...?!
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నిత్య యవ్వనులుగా ఉండండిలా...!
మామిడితో మధురమైన ఆరోగ్యం
ఆరోగ్యంగా ఉండండిలా...!
శాఖాహారంతో బుద్ధిమంతులుకండి...!
గుండె ఆరోగ్యంకోసం ఏం చేస్తున్నారూ...?
ప్రయాణంలో ఆరోగ్యం !