పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » కథనాలు » అధికంగా టీ తాగితే నష్టమేం లేదు! (health die | food health tips | tea | health fact | Black Tea | Green Tea)
 
FILE
సాధారణంగా ప్రతి ఒక్కరికి టీ తాగే అలవాటుంటుంది. అందునా ఉదయం నిద్ర లేవగానే టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా తాము పనిలో ఉన్నప్పుడైనా సరే టీ తాగందే కొందరికి ఏమీ తోచదు. కాని టీ సేవించే వారి ఆరోగ్యంపై ఇది మంచి, చెడు ఫలితాలను అందిస్తుందంటున్నారు వైద్యులు. టీ సేవించడం వలన కలిగే కొన్ని లాభనష్టాల గురించి తెలుసుకుందాం.

** 1 బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లుండవంటారు నిజమేనా?

*** గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ ఒకే రకానికి చెందిన "కైమెలియాసైనేసిస్" తేయాకు మొక్క నుంచి లభిస్తుంది. బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ సేవిస్తే దానినుంచి సమపాళ్ళల్లో ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి.

రెండు రకాల టీల ద్వారా ఫ్లేవనాయిడ్స్ శరీరానికి లభిస్తాయి. కాని వీటి పనితనం వేరు వేరుగా ఉంటుంది. బ్లాక్ టీ సేవించడం వలన శరీరంలోని రక్తంలో యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయంటున్నారు వైద్యులు.

** 2 టీ సేవించడం వలన శరీరంలోని నీటి సాంద్రతను తగ్గిస్తుందంటారు ఇది ఎంతవరకు నిజం?

*** తేనీరు ద్రవ పదార్థం. దీనిని సాధారణంగా తీసుకుంటుంటే డీహైడ్రేషన్ కలుగదు. శరీరానికి కావలసినంత నీరు లభించకపోతే టీ సేవించ వచ్చంటున్నారు వైద్యులు. నీటి తర్వాతి స్థానం తేనీరేనంటున్నారు వైద్యులు.
FILE


** 3 తేనీరులోను కెఫిన్ ఉంటుందా?

*** ఓ కప్పు తేనీరు సేవిస్తే కాఫీలోని కెఫిన్ సగభాగం శరీరానికి అందుతుంది.

** 4 కొందరు తేనీరు అధికంగా సేవిస్తుంటారు. ఇలా అధికంగా తేనీరు సేవించే వారి ఆరోగ్యానికి హానికరంమంటారు నిజమేనా?

*** ప్రతి రోజు ఎనిమిది కప్పుల తేనీరు సేవిస్తుంటే శరీరానికి కావలసిన నీటి కొరతను తేనీరు తీరుస్తుంది. తేనీరు అధికంగా సేవించేవారు అందులో కలుపుకునే చక్కెరపై కాస్త దృష్టి సారించాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.

** 5 తేనీరు త్రాగడం వలన శరీరానికి కావలసిన ఇనుమును నిరోధిస్తుందంటారు ఎందుకని?

*** పౌష్టిక ఆహారం లేదా సమతుల్యమైన ఆహారం తీసుకుంటుంటే శరీరానికి కావలసిన ఇనుము లభిస్తుంది. కాని పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు తేనీరు ఎక్కువగా సేవిస్తుంటే వీరిలో ఇనుము శాతం తగ్గిపోతుంది. మీకు తేనీరు సేవించాలనుకుంటే భోజనం ముగించిన ఒక గంట తర్వాత తేనీరు సేవించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.