పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » కథనాలు » బాదంపప్పులు సర్వరోగ నివారిణి (Cashew nuts | Protiens | Doctors | Unani Medicine | Body | Mind | Stress)
Feedback Print Bookmark and Share
 
బాదం పప్పుల్లో ప్రోటీన్లు 16.5 శాతం, నూనె 41 శాతం కలిసి ఉంటాయి. బాదం పప్పులను ఏ రకంగానైనా తీసుకోవచ్చు. ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన అన్నిరకాల వైద్య గుణాలున్నాయంటున్నారు వైద్యులు. సమతుల్య ఆహారంలో బాదం పప్పులను కూడా జోడించినట్లు వైద్యులు తెలిపారు.

ప్రకృతిపరంగా అందించే వైద్యసేవలో ఉదాహరణకు యూనానీ వైద్యంలో బాదం పప్పులు ముఖ్యంగా బాదం నూనె సేవించడం కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అనీమియాను పారద్రోలే గుణం ఇందులో ఉంది. బాదం పప్పును తీసుకుంటే శారీరక, మానసిక పరమైన ఒత్తిడిని దూరం చేసే గుణాలున్నాయి.

అలాగే నపుంశకత్వాన్ని కూడా ఇది పారద్రోలుతుందంటున్నారు వైద్యులు. దీంతోపాటు శ్వాసక్రియకు సంబంధించిన వ్యాధులేవైనా ఉంటే కూడా మటుమాయమవుతాయంటున్నారు వైద్యులు.

బాదం పప్పులు, నూనె సేవించడం వలన కలిగే లాభాలేంటో ఓ సారి తెలుసుకుందాం :

** బాదం నూనెను తీసుకుంటే మలబద్దకం మటుమాయమౌతుంది. అలాగే శరీరానికి బలం చేకూరుతుంది.

** కుటుంబమంతటికి కూడా ఇది ఆదర్శవంతమైన టానిక్‌లా బాదం నూనెను వాడొచ్చు. ఆహారానికి రంగు, రుచి వచ్చేలా దీనిని (ఫుడ్ ఎడిటివ్‌) వాడొచ్చంటున్నారు వైద్యులు.

** కడుపులోనున్న ఇబ్బందులను తొలగించి, కడుపులోని ప్రేగులలో క్యాన్సర్ లక్షణాలుంటే కూడా ఇది తొలగిస్తుంది.

** బాదం నూనెను నియమానుసారం సేవిస్తుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండెకు చాలా లాభం చేకూరుతుంది.

** బాదం సేవిస్తుంటే మెదడుకు, నరాల బలహీనతకు బలాన్ని చేకూరుస్తుందంటున్నారు వైద్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.