డైటింగ్ చేయాలనుకుంటే మీరు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయాలంటున్నారు వైద్యులు.
** మీరు పగటిపూట తీసుకునే ఆహారంలో రాత్రి పూట తీసుకునే ఆహారం చాలా తక్కువగా ఉండాలి.
** భోంచేసేటప్పుడు భోజనాన్ని మింగకుండా నమిలి, నమిలి తినండి. దీంతో మీరు తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది.
** మధ్యాహ్నం, రాత్రి పూట మీరు తీసుకునే ఆహారానికి ముందు సలాడ్ తీసుకోవడం మర్చిపోకండి.
** సలాడ్ తీసుకునేటప్పుడు ఎక్కువగాను లేదా మరీ తక్కువగాను తీసుకోకూడదు.
** గోధుమపిండిని జల్లించకుండా అలాగే రొట్టెలు చేసి తింటే ఫలితముంటుంది.
** కూరగాయలపైనున్న పొట్టును పూర్తిగా తొలగించకండి. సాధారణంగా స్క్రబ్ చేయండి చాలు. ఇలా చేసిన తర్వాత వండుకుని భుజించండి.
** వీలైనంత మేరకు ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి.
** ఉప్పు శాతాన్ని వీలైనంత మేరకు తగ్గించండి.
** వయసు పెరిగే కొద్దీ మీరు తీసుకునే ఆహారాన్ని తగ్గించండి.
** మీరు తీసుకునే ఆహారంలో పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగు కలిగిన కూరగాయలుండేలా చూసుకోండి.