పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » కథనాలు » ఆరోగ్యానికి కాల్షియం చాలా అవసరం...! (Health | Calcium | Body | Women | Men | Healthy Diet | Vegetables | Iron)
Feedback Print Bookmark and Share
 
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో కాల్షియం చాలా అవసరం. ముఖ్యంగా ఆడవారిలో అధికంగా కాల్షియం లోపం వలనే వారు బలహీనంగా కనిపిస్తుంటారు. దీంతో ఇతరత్రా రోగాలబారిన పడుతుంటారు. మీరు నిత్యం తీసుకునే పోషకాహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి. చిన్నప్పటినుంచే మనం తీసుకునే ఆహారంలో ఐరన్‌, కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.

దంతాలు, ఎముకలు పటిష్టంగా ఉండాలంటే శరీరంలో తగిన కాల్షియం ఉండాలి. శరీరంలో కాల్షియం తగ్గే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలకే అధిక కాల్షియం అవసరం అంటున్నారు వైద్యనిపుణులు.

మహిళల్లో వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకలు పెళుసుగా మారతాయనడంలో సందేహం లేదు. దీనికి కారణం కాల్షియం కొరవడటమేనంటున్నారు వైద్యులు. వయస్సు పెరుగుతున్నా ఎముకలు పటిష్టంగా ఉండాలంటే పాలను, పండ్లను అధికంగా తీసుకోవాలి.

సి విటమిన్‌, కాల్షియం సప్లిమెంట్లను తింటే శరీరానికి కాల్షియం పుష్కలంగా అందుతుంది. గోధుమలు, పాలిష్‌ చేయని బియ్యం, పీచుపదార్థాలు తింటే పూర్తిస్థాయిలో కాల్షియం అందుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.