పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » కథనాలు » మాలిష్ చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు (Malish | Body | Oil | Massage | Hands | Blood Circulation | Smooth | Soft)
Feedback Print Bookmark and Share
 
FILE
మాలిష్ చేసుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం కేవలం శరీరానికి నూనె రాసుకుని రుద్దుకోవడం కాదు. నూనె శరీరపు చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించాలి. దీంతో నరాలలో రక్తప్రసరణ సజావుగా జరిగి ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మాలిష్ చేసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మాలిష్ ఎల్లప్పుడు మెల్లమెల్లగా చేతులతో మృదువుగా రుద్దాలి. వెంటవెంటనే మాలిష్ చేయించుకోకూడదు. మాలిష్ చేసే సందర్భంలో శరీరంలోని అన్ని భాగాలను మెల్లగా, మృదువుగా అదుముతూ మెత్తగా కొడుతుంటే శరీరానికి మంచి ఊరట కలుగుతుంది. ఒత్తిడి దూరమౌతుంది.

మాలిష్ చేసిన వెంటనే భోజనం లేదా స్నానం చేయకండి.

మాలిష్ చేసిన తర్వాత కాసేపు ఎండలో కూర్చోవడంతో కాస్త లాభం కలుగుతుంది.

మాలిష్ చేసుకున్న అరగంట తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. బ్రష్‌తో శరీరాన్ని రుద్ది స్నానం చేయండి. దీంతో నూనె కారణంగా రోమాలు పేరుకుపోయివుంటే అవి తెరుచుకునేందుకు ఆస్కారముంది.

ఉదరంపై ఎక్కువ బలాన్నుపయోగించి మాలిష్ చేయకండి. ఎందుకంటే ప్రేగులపై తీవ్రమైన భారం పడుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.