పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » కథనాలు » కొవ్వును కరిగించుకోవడానికి ముద్దుల్లో మునిగితేలండి!! (Kiss | fat | Romance | Bedroom | sex Dite)
kissing lovers
File
FILE
రోడ్లపై లభ్యమవుతున్న ఫాస్ట్‌ఫుడ్స్‌ను తిని అడ్డంగా బలుస్తున్నారా.? ఇలాంటి ఆహారం వల్ల మీ శరీరంలో కొవ్వు విపరీతంగా పెరిగిపోతుందా? దీన్ని కరిగించుకోవడానికి గంటల కొద్దీ జిమ్‌లలో కుస్తీ పడుతున్నారా? ఇపుడు ఇలాంటివేమీ చేయొద్దని విదేశీ వైద్యులు ఉచిత సలహా ఇస్తున్నారు.

ఆఫీసులో గంటల కొద్దీ సీట్‌లో కూర్చొని కష్టపడుతున్నా కొత్త వ్యాధులను తెచ్చిపెట్టే ఊబకాయం వస్తోందని, జిమ్ కెళ్లే సమయం లేదని బాధపడొద్దని డాక్టరు చెపుతున్నారు. అదేంటంటే గంటల కొద్దీ జిమ్‌లో గడపకుండా హాయిగా మత్తుగా బెడ్ మీదనే భార్యామణితో గడపమంటున్నారు.

భార్యామణి లేదా ప్రియురాలు ఇచ్చే ముద్దుల మత్తులో గడపండి అని సలహా ఇస్తున్నారు. కెర్రీ మెక్ క్టోస్కే అల్టిమేట్ సెక్స్ డైట్ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో అర్థగంట సేపు ముద్దుల్లో మునిగితేలితే ఏకంగా 150 నుంచి 250 కేలరీల శక్తి ఖర్చువుతుందట. ఇంకా మీరు కిందామీద పడేదాన్ని బట్టి 350 కేలరీలు కూడా కరిగే అవకాశం ఉందట.

చెమటలు కక్కేలా జిమ్‌లో బస్కీలు తీస్తూ కుస్తీ పడటం కంటే... భార్యతో పడక గదిలో సంతోషంగా గడపడం మేలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇది స్త్రీలకైనా పురుషులకైనా కొవ్వు కరిగించుకోవడానికి ఇదే ఉత్తమమైన మార్గమని ఈ పుస్తకం రాసిన డాక్టరు అంటున్నాడు. ఇకెందుకు ఆలస్యం... పడక గదిలో ట్రై చేయండి.... అవునో కాదో తేలిపోతుంది.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia