శరీర దుర్వాసన పోవాలంటే ఏలకులు, తుంగముస్తలు, కచ్చురాలు, హారతి కర్పూరం సమభాగాలు తీసుకుని పొడిగా చేసుకోండి. ఈ పొడితో ప్రతిరోజూ స్నానానికి ముందు పొడిని నీటితో కలిపి శరీరానికి పూసుకుని ఆరిన తర్వాత స్నానం చేయాలి. ముఖాన్ని శుభ్రం చేసేందుకు బేబీ లోషన్ చక్కగా ఉపయోగపడుతుంది. గుడ్డుసొన, మజ్జిగ కలిపి ముఖం మీద ప్యాక్ వేసుకుంటే ముడతలు తగ్గిపోతాయి. కొబ్బరి నూనెలో మరువం వేసి కాచి వడగట్టి దానిని తలకు రాలుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.