ఫిబ్రవరినెలలో చలి పరిసమాప్తమౌతుంది. ఆ తర్వాత ఎండాకాలం వచ్చేస్తుందని మనం అనుకుంటాం. కాని ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా వుండాలని అంటున్నారు వైద్యులు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. చలికాలం చివరి రోజుల్లో జలుబు అధికంగా వచ్చే సూచనలున్నాయి. ముఖ్యంగా ఆస్తమా వ్యాధితో బాధపడేవారికి ఈ చలికాలం నరక ప్రాయంగా కనపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎవరితోనైనా పెట్టుకోండి, కాని జలుబుతో మాత్రం పెట్టుకోకండి అని అంటుంటారు మన పెద్దలు. కాని జలుబు వచ్చినప్పుడు చాలామంది అలోపతి మందులు వాడుతుంటారు. ఇది సరైన పద్దతి కాదంటున్నారు వైద్యులు. అలోపతి మందులు నొప్పులు, జర్వం లాంటివాటిని తగ్గిస్తాయి, కాని జలుబును మాత్రం తగ్గించలేవంటున్నారు వైద్యులు. జలుబుకు అలోపతి మందులు ఏ మాత్రం పనిచేయవు. జలుబు వచ్చినప్పుడు పకృతిపరమైన వైద్యం తీసుకోవాలి. చికెన్ సూప్, శొంఠితో కూడుకున్న టీ, ప్రకృతి పరమైన విటమిన్‌లు, వెల్లుల్లి-అల్లం లాంటివి తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని వైద్యులు తెలిపారు. ఇలాంటి కొన్ని చిట్కాలు మీకోసంచికెన్ సూప్ఎవరైతే ఆస్తమాతో బాధపడుతుంటారో వారు చలికాలంలో చికెన్ సూప్ తీసుకుంటే లాభదాయకం. ఇందులో అమినో ఆమ్లం ఉంటుంది. చలికాలంలో ఆస్తమా నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. దీని ఆవిరి పడితే కూడా మంచిదేనంటున్నారు వైద్యులు. ఔషధాలతో కూడుకున్న టీ ఔషధాలతో కూడుకున్న టీ వేడిని పుట్టిస్తుంది. దీనిని సేవిస్తే గొంతులో గరగరలాడుతుంది. మిరియాలు, లవంగ, అల్లం, తులసీ ఆకులు, జాజికాయ, దాల్చిన చెక్కతో చేసిన టీ జలుబు, దగ్గుకు ఎంతో లాభదాయకం అంటున్నారు వైద్యులు. గ్రీన్ టీ లేక బ్లాక్ టీగ్రీన్ టీ లేక బ్లాక్ టీ తీసుకుంటే గొంతులో గరగర, ముక్కు దిబ్బడ, తలనొప్పినుండి ఉపశమనంలభిస్తుందంటున్నారు వైద్యులు. విటమిన్ సిజలుబు చేసినప్పుడు విటమిన్ సి కూడా ఎంతో మంచిదంటున్నారు వైద్యులు. విటమిన్ సి నిమ్మకాయ, కమలాపండ్లు, నెల్లికాయల్లో ఉంటుంది. జలుబు చేసినప్పుడు ఇవి తీసుకుంటే ఎంతో లాభమంటున్నారు వైద్యులు. |