ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > వ్యాధి > చెమట దుర్గంధాన్ని నివారించండిలా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చెమట దుర్గంధాన్ని నివారించండిలా...!
Gulzar Ghouse
Content consultent
సాధారణంగా చాలామందిలో చెమటవాసన అధికంగా ఉంటుంది. దీంతో పక్కవారికి ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి...!

** ఒకసారి వాడిన దుస్తులు ఉతకకుండా అల్మారాలో పెట్టకండి.

** ఉతకని దుస్తులను అల్మారాలో ఉంచడంవలన అందులోనున్న దుర్గంధాన్ని ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా మూలంగా ఉతికిన బట్టల్లోకూడా దుర్గంధం ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

** ముఖ్యంగా చెమటవాసన ఎక్కువగా వచ్చేవారు తమ శరీర శుభ్రతను పాటించాలి.

** వేపతోకూడుకున్న సబ్బును మీ స్నానపు సబ్బుగా వాడండి. దీంతో శరీరంలోనుంచి ఉత్పన్నమయ్యే చెమటవాసననుంచి ఉపశమనం కలుగుతుంది.

** వీలైనంతమేరకు తీవ్రమైన ఎండనుంచి మిమ్ములను మీరు కాపాడుకోండి.

** మీరు ధరించే దుస్తులు శరీరానికి మరీ అంటుకుపోయేలా ఉండకూడదు. ఎందుకంటే శరీరానికి అంటుకుపోయేలా ఉండే బట్టలు వేసుకుంటే చెమట మరీ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే శరీరానికి గాలి సరిగా తగలదుకాబట్టి. దీంతో మీరు ధరించే దుస్తులు చెంటవాసన ఎక్కువగా ఉంటుంది.

** సింథటిక్ వస్త్రాలు వాడే బదులు నూలు వస్త్రాలు వాడితే సౌకర్యంగా ఉంటుంది.

** చెమటవాసన ఎక్కువగా ఉండేవారు వేంచిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోరాదు. అలాగే మసాలాలున్న పదార్థాలు కూడా ఆహారంగా తీసుకోకూడదు.

** ఋతువులననుసరించి లభించే పండ్లు తినాలంటున్నారు వైద్యులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
క్యాన్సర్‌ను నిరోధించే "ప్రోసాపోసిన్"
"ఆపిల్స్, అవకాడో, రెడ్‌వైన్"లతో ఆర్థరైటిస్‌కు చెక్..!
"రక్తపోటు"కు ప్రతిరోజూ బిళ్లలు వాడాల్సిందేనా..?
రక్తపోటు అంటే ఏమిటి...?
అలర్జీ ఎలా వస్తుంది...?
"పై పెదవి" కొరుక్కునే పురుషుల్లో క్యాన్సర్