ఆరోగ్యకరమైన దంతాలకోసం మీరు మీ దంతాలతో స్నేహం చేయండి. ఇవి మీ శరీరంలోని ఓ భాగం. దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే, వాటికి సరైన పోషక పదార్థాలు అందివ్వకపోతే దంత సమస్యలు తలెత్తుతాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు వైద్యులు.
మీ చిగుళ్ళనుంచి రక్తం వస్తుంటే ఒక లీటరు గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా బ్రాందీ, రెండు చుక్కల లెమన్ ఆయిల్, ఒక చుక్క లెవెండర్ ఆయిల్ మరియు ఒక చుక్క యూకలిప్టస్ ఆయిల్‌ను కలిపుకోండి. ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని పుక్కలించండి. ఎట్టి పరిస్థితుల్లోను దీనిని మింగకూడదంటున్నారు దంత వైద్యులు.