పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వ్యాధి » క్యాన్సర్ బారిన పడకుండా ఉండండిలా...! (Cancer | Doctors | Vegetables | Food)
 
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ కోసం ఇప్పటి వరకు ప్రత్యేకంగా మందులేవీ తయారుకాలేదు. కాని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండగలం అంటున్నారు ఆరోగ్యనిపుణులు.

** పైపిలామా వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తితో మీరు శారీరక సంబంధం ఏర్పరచుకుని ఉంటే మీరుకూడా ఈ వైరస్ బారినపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వైరస్ త్వరగా వ్యాపిస్తుంది. కాబట్టి అపరిచితులతో శారీరక సంబంధం ఏర్పరచుకోవడం ప్రమాదమంటున్నారు వైద్యులు.

** క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకుగాను మీరు తప్పనిసరిగా కూరగాయలు, ఆకుకూరలు, శెనగలు ఆహారంగా తీసుకుంటుంటే ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ శరీరానికి త్వరగా సోకదంటున్నారు వైద్యులు. పుష్టికరమైన ఆహారం తీసుకుంటుంటే రకరకాల వైరస్లతో పోరాడేందుకు ఆకుకూరలు, కాయగూరలలోనున్న పోషక విలువలు తోడ్పడతాయి.

** వీలైనంత మేరకు చక్కెరను ఆహారంగా తీసుకోవడం తగ్గించండి. ముఖ్యంగా మహిళల్లో వారు తీసుకునే చక్కెర కారణంగానే క్యాన్సర్ కణాలు పెరిగిపోతాయి. దీంతో వారు క్యాన్సర్ వ్యాధిబారిన పడతారంటున్నారు వైద్యులు.

** మీరు వాడే వంట నూనెలో ఎంతమాత్రం అది ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అందులో కొవ్వు శాతం ఎంతమాత్రం ఉంది అనేది తెలుసుకుని మరీ వాడాలి. ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెను వంటనూనెగా వాడండి. ఎందుకంటే ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంది.
 
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.