వాతావరణ మార్పుతో ప్రజలను అమాంతం ఆక్రమించే అనారోగ్యం జలుబు. ఈ జలుబు కొంతమందిలో ఒకటి రెండు రోజులకే తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో అది దీర్ఘకాలం కొనసాగుతుంది. దీనికి కారణముందంటున్నారు వైద్యులు.
ఒకసారి జలుబు చేసిన తర్వాత నోట్లోని లాలాజలంలో వైరస్ చేరి ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేవగానే పళ్లు తోమేందుకు టూత్ బ్రష్‌లను వాడుతాం కనుక లాలాజలంలోని వైరస్ బ్రష్‌పైకి చేరి అలా ఉండిపోతుంది.
పడిశం బాధను భరించలేక అది తగ్గడానికి మాత్రలు వాడటంతో కాస్త ఉపశమనం అనిపిస్తుంది. కానీ మరుసటి రోజు అదే బ్రష్‌ను ఉపయోగించడంతో దానిపై ఉన్న వైరస్ తిరిగి శరీరంలోకి ప్రవేశించి సమస్యను కొనసాగిస్తుంది. ఇలా అది మొండి జలుబుగా మారిపోతుంది. కనుక జలుబు వదలనప్పుడు టూత్ బ్రష్‌ను వదిలేస్తే మొండి జలుబును వదిలించుకోవచ్చంటున్నారు వైద్యులు.