వేసవి వచ్చిందంటే పిల్లలకు ఆనందం. ఎందుకంటే వేసవి సెలవుల్లో అమ్మమ్మ, తాతయ్య ఊర్లకు వెళ్లడం... ఇలా హడావుడిగా ఉంటుంది. వేసవి వచ్చేస్తోంది కాబట్టి పిల్లలు పరీక్షలకు, సెలవులకి ఊర్లకు వెళ్లడానికి సిద్ధమవుతూంటారు. వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తాగుతుంటాం. అలాగే కొన్ని చిట్కాల ద్వారా సౌందర్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చు. చల్లని నీటిలో నిమ్మ రసాన్ని కలిపి వాటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేస్తే అలసిన ముఖం కాంతివంతంగా మారుతుంది. వేసవి కాలంలో రెండు సార్లు స్నానం చేయాలి. అలా చేయక పోతే చెమట పడుతుంది. స్నానం చేసి టాల్కం పౌడర్ రాసుకోవాలి. దీంతో చెమట పొక్కులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
|