ప్రధాన పేజి   ఇతరాలు  ఆరోగ్యం  పెరటి వైద్యం
 
బొప్పాయి మానవజాతికి మేలు
బొప్పాయి పాలతో మానవ జాతికి ఎన్నోవిధాల మేలు కలుగుతుంది. బొప్పాయి పాలను పేరుకున్న నెయ్యిని కలిపి తీసుకుంటే కడుపులో నొప్పి తగ్గుతుంది. కాలేయ పెరుగుదలను అరికట్టే గుణం బొప్పాయి పాలతో ఉంది. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి రోజూ ఒక్క భాగం సేవిస్తే కాలేయ పెరుగుదలను నిర్మూలించవచ్చు. బొప్పాయి పాలను తేలు కుట్టిన చోట రాస్తే విషాన్ని తీసేస్తుంది.

బొప్పాయి పండును ప్రతి రోజు తీసుకుంటే మతిమరుపు దూరం కాగలదు. బొప్పాయి గింజలను ఎండ బెట్టి చూర్ణము చేసి పేరుకున్న నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న పురుగులు నశిస్తాయి. బొప్పాయి పండు మాత్రమే కాదు దాని ఆకులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. నరాల వాపుకు దీని ఆకులను వేడి నీటిలో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది.
మరిన్ని
తల్లికాబోవు స్త్రీల అందానికి ప్రొటీన్లే రక్షణ కవచాలు
అజీర్తికి ద్రవాహారమే మంచి మందు
విటమిన్ల బాండాగారం : మన పెరటిలోని అరటి
ఆముదంతో కీళ్ల, కాళ్ల నొప్పులు మటుమాయం
వేసవిలో కీరదోసతో సౌందర్య సంరక్షణ
కోపాన్ని అదుపుచేయడంలో టమోటా పాత్ర