ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం
 
కురుల సంరక్షణకు కొన్ని చిట్కాలు
నేటి తరం యువతలోనే కాకుండా చిన్న వయస్సు పిల్లల్లో సైతం కురులు తెల్లబడటం, రాలిపోవటం జరుగుతోంది. దీంతో ఈ కురుల సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి రకరకాల చికిత్సలను ఆశ్రయిస్తూ ఎంత డబ్బైనా ఖర్చుచేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ లాభం లేకుండా పోతోందని కొందరు నిరుత్సాహంగా చెబుతున్నారు.

అయితే జుట్టు సమస్యలను అరికట్టేందుకు ఇంత ఖర్చు, శ్రమ అవసరం లేదు. కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది. మెంతి పొడి, ఆవాల పొడి, టీ పొడి, గోరింటాకు, పెరుగులు అన్నీ ఒక్కొక్క స్పూను చొప్పున కలిపి అందులో నిమ్మ రసం పిండి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒకరోజు రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు తలకు పట్టించి ఆరిన తర్వాత శీకాయి పొడితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు పట్టులాగా ఉంటుంది. జుట్టు తెల్లబడడం, రాలడం వంటివి తగ్గి కురులు నల్లగా నిగనిగలాడతాయి.
మరిన్ని
విసిరేసే కరివేపాకులో లక్ష ఉపయోగాలు
మరులు గొలిపే మల్లెపూలు గుబాళింపులు
దంతాలకు సంరక్షణలో పండ్ల పాత్ర
తీయనైన తేనెతో పిల్లలకు తేనె పలుకులు
కోపాన్ని కంట్రోల్ చేసే తాజా టమోటా
ముఖ తేజస్సును పెంచే కొబ్బరి