ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం
 
పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు
మనం తీసుకునే ఆహారంలో పండ్లు కూరగాయలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. ముఖ్యంగా పండ్లు కూరగాయల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

నెలలో కనీసం మూడుసార్లయినా పండ్లు కూరగాయలకు సంబంధించిన రసాలు తీసుకోవటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. ఉదాహరణకు టొమేటో రసం తీసుకన్నట్లయితే గుండె సంబంధిత జబ్బులకు దారితీసే అవకాశం తగ్గుతుంది.

అదే విధంగా మలబద్దకం, డయారియాలతో బాధపడేవారు నిమ్మరసాన్ని తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడతారు. ఇక మార్కెట్లో మనకు విరివిగా దొరికే ద్రాక్షలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

ద్రాక్ష రసం ధమనుల గోడలకు విశ్రాంతినివ్వటం ద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని సైతం తగ్గించే గుణం ద్రాక్ష రసానికి ఉంది. గుండెజబ్బులను దరిచేరకుండా చూడటంలోనూ ఈ రసం ఎంతో సహాయపడుతుంది.
మరిన్ని
ఖర్జూరలోని విశిష్ట ఔషధ గుణాలు
తులసితో కలిగే లాభాలేమిటో తెలుసా?
కురుల సంరక్షణకు కొన్ని చిట్కాలు
విసిరేసే కరివేపాకులో లక్ష ఉపయోగాలు
మరులు గొలిపే మల్లెపూలు గుబాళింపులు
దంతాలకు సంరక్షణలో పండ్ల పాత్ర