ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం
 
మెంతుల్లో ఔషధ గుణాలెన్నో...
ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువుల్లో అనేక ఔషధ గుణాలుంటాయి. ఇందులో మెంతుల్లో ఉండే ఔషధ గుణాలు, వ్యాధులను నివారించే చిట్కాలు కొన్ని మీ కోసం... మెంతుల్లో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మెంతికూర, మెంతులు అజీర్ణంస కడుపులో మంట కడుపు ఉబ్బరం, మొదలైన లక్షణాలను నివారిస్తాయి.

మెంతి గింజల కషాయం జ్వరానికి బాగా పని చేస్తుంది. జ్వరం తగ్గించి రిలీఫ్ కలుగజేస్తుంది. ఈ గింజల్ని నానబెట్టి రుబ్బి, పేస్ట్‌లా తయారు చేసి, తలకి పట్టించి ఒక గంట తర్వాత స్నానం చేస్తే, వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుంది. వెంట్రుకలు నల్లగా చక్కగా పెరుగుతాయి. తలలో చుండ్రు వంటి సమస్యలు ఉండవు.

చర్మ వ్యాధులకు కూడా మెంతుకూర చక్కని ఔషధం. లో బీపీ ఉన్న వారికి రక్తప్రసారాన్ని పెంచి మెంతులు బాగా పనిచేస్తాయి. కామెర్లు, రక్తక్షీణత, జలోధరం, మొదలైన వ్యాధులను మెంతికూరను తరచుగా తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. మెంతు గింజల్ని నీటిలో వేసి తాగితే పేగుపూత వ్యాధి, కడుపులో మంట వంటి వ్యాధులు నయం అవుతాయి.
మరిన్ని
పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు
ఖర్జూరలోని విశిష్ట ఔషధ గుణాలు
తులసితో కలిగే లాభాలేమిటో తెలుసా?
కురుల సంరక్షణకు కొన్ని చిట్కాలు
విసిరేసే కరివేపాకులో లక్ష ఉపయోగాలు
మరులు గొలిపే మల్లెపూలు గుబాళింపులు