ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం
 
వెల్లుల్లిపాయల్లోని ఔషధ గుణాలు
వెల్లుల్లిని వంటలో చేర్చుకోవడం ద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. వెల్లుల్లిలో గల ఔషధ గుణాలు కొన్ని మీ కోసం... విష కీటకాలు కుట్టినప్పుడు విషం హరిస్తానికి, విరుగుడికి వెల్లుల్లి రసాన్ని కుట్టిన చోట రుద్దాలి.

* గొంతులో మంట, ఊపిరితిత్తుల వ్యాధులను వెల్లుల్లిపాయ వెంటనే నివారిస్తుంది. నడుం నొప్పి, కండరాల నొప్పులను తగ్గించటమే కాకుండా ఉబ్బు రోగాన్ని కూడా వెల్లుల్లి తగ్గిస్తుంది. ప్రతిరోజు ఉదయం పూట రెండు పొట్టుతీసిన వెల్లుల్లిపాయలను బాగా చితక కొట్టి తినడం వలన గుండెజబ్బులు, హై-బీపీ తగ్గుతాయి.

*వెల్లుల్లి మలేరియా, కలరా వంటి వ్యాధులను అరికడుతుంది. జాయింట్ల నొప్పులను వెల్లుల్లి నివారిస్తుంది. ఎముకల పటిత్వానికి శరీర సహజ ఎదుగుదలకి వెల్లుల్లి ఎంతో ఉపయోగిస్తుంది. *కడుపుకి సంబంధించిన ఏ రుగ్మతలైనా వెల్లుల్లి ఎక్కువగా తినడం వలన తగ్గుతాయి. ఇది కేన్సర్ రాకుండా కాపాడుతుంది.

* చెవిపోటు ఉన్నప్పుడు రెండు చుక్కలు వెల్లుల్లి రసం వెంటనే తగ్గుతుంది. కోరింత దగ్గుకి పది చుక్కలు వెల్లుల్లి రసాన్ని తాగితే తక్షణమే దగ్గు తగ్గిపోతుంది. వెల్లుల్లిని వాడితే సంతానవంతులవుతారు. దృఢంగా, మేధావులుగా ఎదుగుతారు.
మరిన్ని
మెంతుల్లో ఔషధ గుణాలెన్నో...
పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు
ఖర్జూరలోని విశిష్ట ఔషధ గుణాలు
తులసితో కలిగే లాభాలేమిటో తెలుసా?
కురుల సంరక్షణకు కొన్ని చిట్కాలు
విసిరేసే కరివేపాకులో లక్ష ఉపయోగాలు