ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం
 
పుదీనాలోని ఔషధ గుణాలు
పరిమళాన్ని వెదజల్లే పుదీనా ఆకులు వంటకాలకు రుచిని ఇవ్వడానికి మాత్రమే కాకుండా చక్కని ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల్లోని ఓషధ గుణాలేంటో చూద్దాం....

* నీరు బాగా మరిగించి పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. అజీర్ణం, కడుపుబ్బరం, కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలకు పుదీనా ఆకులు నీటిలో వేసి బాగా మరిగించి చల్లార్చి తాగండి. పుదీనా రసం తలనొప్పికి చక్కని ఔషధం.

* పుదీనా రసం, పొద్దు తిరుగుడు గింజల నూనెలో కలిపి పొత్తికడుపుపై రాసుకుంటే రుతు సంబంధ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మరిగించిన నీటిలో ఆకులు వేసి వస్త్రాల్ని ముంచి కాపడం పెట్టినట్లు చేస్తే కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

* పుదీనాను పచ్చడి చేసుకుని రోజు కాస్త అన్నంలో చేర్చుకుంటే కంటికి మంచిది. కంటినొప్పి, కంటిచూపు తరుగుదల వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. పుదినా ఆకులను సౌందర్యానికి కూడా ఔషధంగా వాడుకోవచ్చు. ముఖంలో మొటిమలు, చర్మవ్యాధులున్న వారు పుదీనా ఆకులను పేస్ట్ చేసి ముఖానికి రాసుకుని ఐదునిమిషాలుంచి స్నానం చేస్తే చర్మవ్యాధులు దరి చేరవు.
మరిన్ని
మల్లెపూవుల్లో- పెరటి వైద్యం
వెల్లుల్లిపాయల్లోని ఔషధ గుణాలు
మెంతుల్లో ఔషధ గుణాలెన్నో...
పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు
ఖర్జూరలోని విశిష్ట ఔషధ గుణాలు
తులసితో కలిగే లాభాలేమిటో తెలుసా?