ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం
 
చర్మవ్యాధులకు జీలకర్ర చక్కని ఔషధం
శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యాన్ని పాటిస్తే సరి. ఈ చర్మ వ్యాధుల విషయంలో జీలకర్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అవసరమైన వస్తువులు :
నల్ల జీలకర్ర: ఒక టేబుల్ స్పూన్
కొబ్బరి : ఒక ముక్క

తయారీ విధానం :
నల్ల జీలకర్రలో కొబ్బరి చేర్చి బాగా నూరి చర్మవ్యాధి సోకిన భాగంపై రాసుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే చర్మ వ్యాధులు మటు మాయమవుతాయి.

అంతేకాకుండా ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం. జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. కడుపులో నులిపురుగుల నివారణకు జీలకర్రను తీసుకోవాలి.
మరిన్ని
పుదీనాలోని ఔషధ గుణాలు
మల్లెపూవుల్లో- పెరటి వైద్యం
వెల్లుల్లిపాయల్లోని ఔషధ గుణాలు
మెంతుల్లో ఔషధ గుణాలెన్నో...
పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు
ఖర్జూరలోని విశిష్ట ఔషధ గుణాలు