ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం
 
అనాస, ఆపిల్, పుచ్చకాయ జ్యూస్‌ల మేలు
జ్యూస్‌లు సాధారణంగా శరీరారోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం మీకు తెలిసిందే. ఆ ఉపయోగాలు ఎలా ఉంటాయన్న విషయంలోకి వస్తే ముందుగా చెప్పుకోవలసినవి అనాస, ఆపిల్, పుచ్చకాయ జ్యూస్‌లు.

ఆపిల్, అనాస: ఈ రెండింటిలోను విటమిన్ సి', ప్రోటీన్‌లు చర్మాన్ని ముడతలు పడకుండా తొడ్పడే కొల్లాజెనిన్‌ను పెంచుతాయి. అలాగే శరీరంలోని నూనె గ్రంధులను క్రమబద్ధీకరించి చర్మంలోని తడారిపోకుండా చేయగలవు. అంతే కాదు ఈ జ్యూస్‌లు ప్రతి రోజు తీసుకోవడం ద్వారా ముఖం కాంతి వంతంగా తయారవుతుంది. అలాగే ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది.

పుచ్చకాయ: వేసవి కాలం వస్తే అందరూ ఎదురు చూసేది వీటి కోసమే... అయితే పుచ్చకాయ రసం సేవించడం ద్వారా శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది.
మరిన్ని
చర్మవ్యాధులకు జీలకర్ర చక్కని ఔషధం
పుదీనాలోని ఔషధ గుణాలు
మల్లెపూవుల్లో- పెరటి వైద్యం
వెల్లుల్లిపాయల్లోని ఔషధ గుణాలు
మెంతుల్లో ఔషధ గుణాలెన్నో...
పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు