స్త్రీ సౌభాగ్యానికి ప్రతిరూపంగా, మంగళకరమైనదిగా పసుపు భారతీయ సాంప్రదాయ సంస్కృతిలో నిలిచిపోయింది. ఈ పసుపు శుభకార్యాలకే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ఆనాడే మన పెద్ద వారు గుర్తించారు.
పసుపు వల్ల కలిగే లాభాల్లో కొన్ని... ప్రతిరోజు కుంకుడు గింజంత పసుపును ఉండలాగా చేసుకుని నీటితో కలిపి మింగితే జీర్ణశక్తిని మరింత మెరుగుపరుస్తుంది. అలాగే ఆకలి పుట్టేట్లు చేస్తుంది.
అయితే మార్కెట్లో కల్తీ పసుపుకు కూడా చోటుంది కనుక పసుపును వాడేవారు ఈ విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండటం అవసరం.
|