సాధారణంగా కరివేపాకు లేకుండా కూరలు చేయరన్న విషయం తెలిసిందే. అలాగే తాలింపులోను కరివేపాకును విరివిగా వాడుతుంటాం. మన దగ్గర లేకపోయినా సరే.. పక్కింట్లో వాళ్లనైనా అడిగి మరి తీసుకుంటాం..
కాని తినేప్పుడు మాత్రం వాటిని తీసి పక్కన పెడుతుంటాం. అయితే కరివేపాకులో ఎన్నో ఔషధగుణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మనం వాడే కూరల్లో కరివేపాకును పక్కన పడేయకుండా ప్రతిరోజు తిన్నట్లైతే అనీమియా (రక్తహీనత) నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.
కరివేపాకులోని ఐరన్ గుణాలు రక్తహీనతను కలిగి ఉన్న వారు బయటపడవచ్చంటున్నారు. అంతేకాక కూరలకు వీటి వల్ల రుచి రావడమే కాక జీర్ణశక్తి మరింత మెరుగపరుస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. పేగులకు, ఉదరమునకు బలాన్నివ్వడమేకాక, శరీరానికి కాంతిని, రంగును కలిగిస్తుంది.
|